ETV Bharat / state

మీకు ఈ విధంగా హోలీ శుభాకాంక్షలు ఎవరైనా చెప్పారా? - హోలీ శుభాకాంక్షలు

హొలీ రోజున పోద్దు పొద్దున్నే అన్ని రంగులూ గొడవ పడుతున్నాయ్. విపరీతంగా శబ్దం చేస్తూ విసిగిస్తున్నాయ్. ఎవరూ నిద్ర లేవకముందే అవి హోలీ పండుగ అని తొందరగా మేల్కొన్నాయ్ అనుకుంట. నేనే గొప్ప నేనే గొప్ప అని ఆ రంగులు ఒకదానితో మరొకటి తగవులాడుతున్నాయి. వాటి మధ్య ఎన్నికలు నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఎన్నికల ప్రచారానికి నడుం బిగించాయి. ప్రతి రంగు తన గొప్పలు ఇలా చెప్పుకుంటూ.. కొన్ని రంగులు ప్రజలను బెదిరిస్తూ.. ఓట్లు అడుగుతూ ముందుకు సాగుతున్నాయి.

holi
మీకు ఈ విధంగా హోలీ శుభాకాంక్షలు ఎవరైనా చెప్పారా?
author img

By

Published : Mar 29, 2021, 5:30 AM IST

Updated : Mar 29, 2021, 9:26 AM IST

రంగుల మధ్య వివాదం వచ్చింది. ఎవరు గొప్ప అనే విషయంలో గొడవ పెద్దది అయ్యింది. దాని కోసం ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గం అనుకుని నిర్ణయం తీసుకున్నాయి. అయితే వాటి ప్రచారం అవే చేసుకోవడం ప్రత్యేకత. హోలీ రోజున ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టి.. ఈ విధంగా ప్రజలతో మాట్లాడుతున్నాయి.

ఎరుపు రంగు:-

ఎవరైనా నన్నే ఎక్కువ ఇష్టపడతారు. హోలీ అనగానే నాకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. నా రంగుతో ప్రతి ఒక్కరి మొహాలు ఎర్రగా నిగనిగలాడుతూ ఉంటాయి. అందరికీ బాగా ఇష్టం నేనంటె. నా రంగు బొట్టు పెట్టుకుని మీరు అమాయకులుగా చెలామణి అవ్వడానికి సహాయం చేస్తున్నాను. నన్నే గెలిపించాలి. మీరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నా రంగుతో ఉన్న రక్తమే మీకు కావాలి. మిమ్మల్ని బతికించేది నా రంగు రక్తమే. మీరు నాకు ఓటు వేసి గెలిపించకపోతే.. రక్తపాతాలు సృష్టించి నా రంగును బయటికి తీస్తా. ఒక్కొక్కరి అంతు చూస్తా.

నలుపు రంగు :-

తల మీద జుట్టు, మూతి మీద మీసం రంగు నా చలవే. నాకు ఓటు వేయకపోతే తెలుపు రంగులోకి మార్చేస్తా. నన్ను అందరూ దురదృష్టానికి సంకేతం అంటారు. మీరు నాకు ఓటు వేసి గెలిపిస్తే మీకు మంచి జరిగేట్టు చూస్తా. నల్ల పిల్లులు లేకుండా రంగు మారుస్తా అని హామీ ఇస్తున్నాను. నన్ను గెలిపించకపోతే మీ ఆనందాన్ని చీకటితో నింపేస్తా. ప్రపంచాన్ని అంధకారంలోకి తోసేస్తా.

పసుపు రంగు :-

కూరలో వేసేది నా రంగునే గుర్తు పెట్టుకోండి. మంచి యాంటీ సెప్టిక్​గా పనిచేస్తూ అందరి ఆరోగ్యాలను కాపాడుతున్న నేనే గొప్ప. మీ ఆరోగ్యాన్ని కాపాడే నన్ను గెలిపించండి. ఆరోగ్యాన్ని పొందండి. ఆడవాళ్లు గుర్తు పెట్టుకోండి. మీకు పసుపు కుంకుమలు జాగ్రత్తగా ఉండాలి అంటే నేనే గెలవాలి. దేవుడి దగ్గర కూడా నేను లేకుండా పూజ జరగదు. నేను దైవాంశ సంభూతుడిని. నేనే గెలవాలి.

ఆకుపచ్చ రంగు :-

మన రాష్ట్రంలో పచ్చని పొలాలు ఎక్కువ. అది నా చలవే. నా రంగు లేకపోతే సృష్టిలో పచ్చదనం లేదు. మీ కంటికి, మనసుకి ఆహ్లాదం పంచుతూ ఉండే నేనే గెలవాలి. ఒకవేళ నేను ఓడిపోతే రంగుల సన్యాసం తీసుకుంటా. ప్రకృతిలో నా రంగు మొక్కలు, చెట్లు లేకుండా చేస్తా.. జాగ్రత్త.

గులాబీ రంగు :-

ఓ యువత మేలుకో. మీరే నన్ను ఆదుకోవాలి. మీరు అమ్మాయిలకి ప్రపోజ్ చేసేది ఎక్కువగా నా రంగు పూలతోనే. మీ ప్రపోజల్స్ అన్నీ ఓకే అయ్యేవిధంగా నేను కృషి చేస్తా. లేకపోతే అన్ని ప్రేమలను ఓడేట్టు చేస్తా. చనిపోయిన వారిని ప్రశాంతంగా కాటికి పంపాలంటే నా రంగు కుంకుమ చల్లాల్సిందే. లేకపోతే చనిపోయిన వారికీ ప్రశాంతత లేకుండా చేస్తా.

తెలుపు రంగు:-

మీరు తినే తిండి ఏ రంగో గుర్తుందా! మళ్లీ ప్రత్యేకంగా చెప్పాలా? మీరు నాకే ఓటు వేస్తారు. నాకు తెలుసు. మీరు తెలుపు రంగు అన్నం తిన్నంతగా ఏ రంగు భోజనమూ తినలేరు. అందువల్ల మీరు నాకే ఓటు వేస్తారని తెలుసు. మీరు రాసుకునే పేపర్​ ఏ రంగో తెలుసుగా.. నాకు కోపం తెప్పించకండి.. నల్లరంగుగా మార్చేస్తా.. ఎలా రాసుకుంటారో చూస్తా..

నీలం రంగు:-

ఆకాశం మొత్తం నా రంగే. మీకు ఎండ కావాలన్నా.. వర్షం కావాలన్నా నేను పక్కకి జరిగితేనే అది సాధ్యం అవుతుంది. వర్షం లేకపోతే మీరు తాగడానికి నీరు ఎలా వస్తుంది. మీరు బతకగలరా? నేనే మీకు జీవనాధారం. అందుకే నన్నే గెలిపించండి.

ఇలా అన్ని రంగులు ఎవరి గొప్పదనం వారు చెప్పుకుంటూ.. తమదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నాయి. అన్ని రంగులు ప్రచారం సాగిస్తూ చివరికి.. ఒకే ప్రదేశంలో కలుసుకున్నాయి. అప్పుడు వివాదం మరింత పెరిగింది. తిట్టుకున్నాయి. కొట్టుకున్నాయి. నేనంటే నేనే గొప్ప అని విపరీతంగా మీది మీదికి వస్తున్నాయి. ఉన్నట్టుండి అన్ని రంగులు కలిసిపోయి ఒక్కసారిగా నా మీద పడ్డాయి. ఉక్కిరిబిక్కిరి అయ్యి.. ఉలిక్కిపడి నిద్ర లేవగానే నాకు అన్ని రంగులు కలిసి ఒకేసారి హోలీ శుభాకాంక్షలు చెప్పాయి. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పమని చెప్పాయి. "హ్యాపీ హోలీ ఫ్రెండ్స్​"

ఇదీ చూడండి: ఇహానికి... పరానికి రంగుల పున్నమి!

Last Updated : Mar 29, 2021, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.