ETV Bharat / state

రైల్వే స్టేషన్​లో రోబోటిక్ మసాజ్ సేవలు.. ఫుల్ బాడీకి 60 రూపాయలే!

Massage Center : ఆంధ్రప్రదేశ్​ విజయవాడ రైల్వే స్టేషన్​లో రోబోటిక్ ​ మసాజ్​ సేవలను రైల్వే శాఖ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం, టికెట్​ ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ సేవలను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

రైల్వే స్టేషన్ లో మసాజ్
రైల్వే స్టేషన్ లో మసాజ్
author img

By

Published : Jan 10, 2023, 12:37 PM IST

Vijayawada Railway Station Massage Center : ఏపీలోని విజయవాడ రైల్వే స్టేషన్​లో రోబోటిక్​ మసాజ్​ సేవలను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయాణికులు రైళ్ల కోసం వేచి ఉండే సమయంలో ఉపయోగించుకునేందుకు వీలుంటుందని ఈ సేవలను​ అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలతో పాటు, సౌకర్యవంతమైన అనుభూతిని అందించటం కోసం సేవలను ప్రారంభించినట్లు వెల్లడించారు. అధికారులు ఏర్పాటు చేసిన రోబోటిక్​ మసాజ్​ సేవలలో రెండు రోబోటిక్​ మసాజ్​ కుర్చీలు, ఒక ఫుట్​ మసాజ్​ కుర్చీ ఉన్నాయి. ఒకటో నంబర్‌ ఫ్లాట్‌ఫామ్‌పై 84 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మసాజ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

మసాజ్​ కుర్చీ ద్వారా బాడీ మసాజ్​, ఫుట్​ మసాజ్​ కుర్చీ ద్వారా పాదాలకు మసాజ్​ లాంటి సేవలందించనున్నట్లు అధికారులు తెలిపారు. బాడీ మసాజ్​​కు 60 రూపాయలు, ఫుట్​ మసాజ్​కు 30 రూపాయలు చెల్లించి మసాజ్​ సేవలను పొందవచ్చని అధికారులు తెలిపారు. ఇటీవలే స్టేషన్‌లో ఫిష్‌ స్పా, హ్యాండ్‌లూమ్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌, మొబైల్‌ యాక్ససరీలకు సంబంధించిన అవుట్‌లెట్లను ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.