సికింద్రాబాద్లోని ఆర్ఆర్సీ గ్రౌండ్లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా రైల్వే రక్షక దళం భద్రతా దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇది దేశ పౌరులంతా భిన్నత్వంలో ఏకత్వం, సోదర భావం, సమానత్వం పట్ల నిబద్ధతతో పునరంకితమయ్యే సమయమని ఆయన అన్నారు.
కొవిడ్ పరిస్థితులలో ఉత్పన్నమైన సవాళ్లను అధిగమించినట్లు గజానన్ మాల్యా తెలిపారు. దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా రైల్వే సర్వీసులు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నాయన్నారు. మొదటి శ్రామిక ప్రత్యేక రైలును కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ రైళ్ల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల భద్రతకు నిరంతరం ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. లాక్డౌన్ సమయంలో సేవలందించిన అన్ని విభాగాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు