ETV Bharat / state

లాక్‌డౌన్‌ అమలు రోజుల్లో బ్యాంకుల పనివేళలపై చర్చ - తెలంగాణలో బ్యాంకులు పనిచేయు వేళలు

లాక్​డౌన్​ అమలు రోజుల్లో పనివేళలు, పని గంటలపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమైంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే పనివేళలు చేయాలని సూచించారు. ఉద్యోగులు అందరికి కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని తీర్మానించాయి.

slbc-bankers-meeting-on-bank-working-timings
లాక్‌డౌన్‌ అమలు రోజుల్లో బ్యాంకుల పనివేళలపై చర్చ
author img

By

Published : May 12, 2021, 2:32 PM IST

తెలంగాణలో లాక్​డౌన్ అమలవుతున్న సందర్భంగా బ్యాంక్‌ పని వేళలు, పరిమిత సంఖ్యలో ఉద్యోగుల హాజరు, వ్యాక్సినేషన్‌ అంశాలపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అత్యవసరంగా సమావేశమై చర్చించింది. జూమ్‌ యాప్‌ ద్వారా ఎస్​ఎల్​బీసి ఛైర్మన్‌ ఓపీ మిశ్రా నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో.. వివిధ బ్యాంకులకు చెందిన కమిటీ సభ్యులు అభిప్రాయాలు వెల్లడించారు.

లాక్‌డౌన్‌ విధింపు సమయంలో బ్యాంక్‌ల కార్యకలాపాలపై ప్రధానంగా చర్చించారు. బ్యాంకు పని వేళలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండేలా చూడాలని ఎస్​ఎల్​బీసీ కన్వీనర్‌ కృష్ణశర్మ సూచించారు. నాబార్డు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సైతం పని వేళలు మధ్యాహ్నం 12 గంటల వరకే ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశాయి. మొదటి రెండు గంటలు ఖాతాదారులకు సేవలు.. ఆ తరువాత రెండు గంటలు అంతర్గత పనులు చేసుకోడానికి సరిపోతుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. వయస్సుతో నిమిత్తం లేకుండా ఉద్యోగులందరికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా చూడాలని సభ్యులు సూచించారు. 50శాతం ఉద్యోగులతో పని చేసే విషయాన్ని ఆయా బ్యాంకులకు వదిలేసిన ఎస్​ఎల్​బీసీ.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనుంది.

ఇదీ చూడండి: ఆక్సిజన్​ అసలు కథ తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.