ETV Bharat / state

TSPSC పేపర్ లీకేజీ కేసు.. పాస్‌వర్డ్‌ చోరీపై మరోసారి సిట్ ఆరా! - హైదరాబాద్ తాజా వార్తలు

TSPSC Paper Leak Case Latest Updates: టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే నిందితులైన షమీమ్, రమేష్, సురేష్ ఇళ్లల్లో సిట్ అధికారులు సోదాలు జరిపారు. రెండో రోజు కస్టడీలో భాగంగా ముగ్గురిని అధికారులు హిమాయత్‌ నగర్‌లోని కార్యాలయంలో ప్రశ్నించారు. ఆ తర్వాత ముగ్గురిని ఇంటికి తీసుకెళ్లి సోదాలు చేశారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 30, 2023, 7:15 PM IST

TSPSC Paper Leak Case Latest Updates: రాష్ట్రంలో టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో పలువురిని అరెస్టు చేశారు. ఇక తాజాగా ఈ కేసులో నిందితులు అయినటు వంటి షమీమ్, రమేష్, సురేష్ ఇళ్లల్లో సిట్ అధికారులు సోదాలు చేశారు. రెండో రోజు కస్టడీలో భాగంగా ముగ్గురిని అధికారులు హిమాయత్‌ నగర్‌లోని కార్యాలయంలో ప్రశ్నించారు. ఆ తర్వాత ముగ్గురిని ఇంటికి తీసుకెళ్లి సోదాలు చేశారు.

షమీమ్, రమేశ్‌కి ప్రవీణ్.. సురేష్‌, ప్రశాంత్‌రెడ్డికి... రాజశేఖర్‌రెడ్డి గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాలిచ్చినట్లు దర్యాప్తులో తేలింది. వారు చెప్పిన వివరాల ఆధారంగా... ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌ అధికారి శంకర లక్ష్మిని మరో సారి కార్యాలయానికి సిట్‌ అధికారులు పిలిపించారు. ముగ్గురు నిందితులు చెప్పిన విషయాలపై వివరాలు తెలుసుకున్నారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో షమీమ్, రమేష్ చేసే పని ఇతర వివరాలపై శంకర లక్ష్మిని అడిగి తెలుసుకున్నారు.

శంకర లక్ష్మిని ఇప్పటికే సిట్ అధికారులు రెండుసార్లు ప్రశ్నించి ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సాక్షిగా చేర్చారు. శంకర లక్ష్మి తన డైరీలో రాసుకున్న లాగిన్ పాస్‌ వర్డ్‌ని దొంగిలించిన ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి సాయంతో కంప్యూటర్‌లోకి చొరబడినట్లు దర్యాప్తులో తేలింది. ప్రశ్నా పత్రాలను కాపీ చేసుకొని పెన్‌ డ్రైవ్‌లో వేసుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.

ఇక గ్రూప్- 1 ప్రిలిమ్స్​లో షమీమ్​కు 126 మార్కులు, రమేష్​కు 122, సురేష్​కు 100కు పైగా మార్కులొచ్చాయని అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. రాజశేఖర్​ రెడ్డి , ప్రవీణ్​ల ద్వారా ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాన్ని ముగ్గురు నిందితులు తీసుకున్నట్లు ఇప్పటికే తేల్చారు. వీరి ద్వారా ఇంకెవరికైనా ప్రశ్నాపత్రం వెళ్లిందా అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ముగ్గురిని వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ లీకేజీ కేసులో ఇప్పటివరకు పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు పోలీసులు.

మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సల్కర్‌పేటకు చెందిన తిరుపతయ్య ఉపాధి హామీ పథకం పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. డాక్యానాయక్‌తో అతడికి పరిచయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే డాక్యానాయక్ తన వద్ద ఏఈ ప్రశ్నపత్రం ఉందని.. తిరుపతయ్యకు తెలిపాడు. దీన్ని సొమ్ము చేసుకునేందుకు ఫరూక్‌నగర్ మండలం నేరెళ్లపల్లికి చెందిన రాజేందర్ కుమార్‌తో రూ.10లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని.. రూ.5 లక్షలు తీసుకొని ప్రశ్నపత్రం చేతికిచ్చేందుకు తిరుపతయ్య దళారిగా వ్యవహరించినట్లు నిర్ధారణ కావడంతో అతన్ని అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.