ETV Bharat / state

పోలీసుల అదుపులో సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 27, 2023, 5:06 PM IST

Updated : Dec 27, 2023, 8:43 PM IST

Senior IPS officer Naveen Kumar Arrest in Hyderabad : ఇల్లు ఖాళీ చేయకుండా కబ్జాకు యత్నించారన్న ఆరోపణలతో సీనియర్ ఐపీఎస్ నవీన్ కుమార్​ను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్రాంత ఐఏఎస్ భన్వర్​లాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

Senior IPS officer Naveen Kumar
Senior IPS officer Naveen Kumar arrest in Hyderabad
పోలీసుల అదుపులో సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్

Senior IPS officer Naveen Kumar Arrest in Hyderabad : సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్​ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలోని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంటికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న కేసులో ఆయణ్ను పోలీసులు విచారిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న తన ఇంటిని భన్వర్​లాల్ అనే ఐఏఎస్ అధికారి 2014లో ఓర్సు సాంబశివరావు, అతని భార్య రూపా డింపుల్​లకు అద్దెకిచ్చారు. అదే సమయంలో ఐదేళ్లకు రెంటల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. 2019లో అగ్రిమెంట్ పూర్తైన తర్వాత సాంబశివరావు దంపతుల వద్ద ఉన్న అగ్రిమెంట్​ను వారి సమీప బంధువైన ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ తీసుకున్నారు. అప్పటి నుంచి ఆ ఇంట్లోనే నవీన్ నివాసముంటున్నారు.

అయితే నవీన్ తన ఇంటికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భన్వర్​లాల్​కు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశాసి ఇంటిని కాజేయాలని చూస్తున్నారని ఫిర్యాదులో భన్వర్​లాల్ సతీమణి మనీలాల్ ఈనెల 17న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో ఓర్సు సాంబశివరావు, అతని భార్య రూపా డింపుల్​ల పేర్లను కూడా చేర్చారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 22వ తేదీ ఓర్సు సాంబశివరావు, అతని భార్య రూపా డింపుల్​ను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. ఇక తాజాగా ఇదే కేసులో ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్​ను ఏ2గా చేర్చి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

"నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఇల్లు వివాదంపై కోర్టులో కేసు నడుస్తోంది. 2020 నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. సివిల్ వివాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీఎస్ పోలీసులు వివరాలు కోసం పిలిచారు. నా దగ్గర ఉన్న సమాచారం ఇచ్చాను. లీగల్​గా ముందుకెళ్తా, రేపు అన్ని వివరాలను వెల్లడిస్తాను." - నవీన్ కుమార్, ఐపీఎస్

IPS Naveen Kumar Arrest : మరోవైపు పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ కుమార్ ఐపీఎస్ అరెస్టును పలు బీసీ సంఘాలు, వారి కుటుంబ సభ్యులు ఖండించారు. నవీన్ కుమార్​ను బషీర్ బాగ్​లోని సీసీఎస్​కు తీసుకురావడంతో వారి కుటుంబ సభ్యులు పలువురు బీసీ సంఘాల నాయకులు అక్కడికి చేరుకున్నారు. తప్పుడు ఫిర్యాదుతో ఓ బీసీ ఐపీఎస్ అధికారిని అక్రమంగా అరెస్ట్ చేశారని నిరసన చేశారు. నిజాయతీ కలిగిన ఓ ఐపీఎస్ ఆఫీసర్ నవీన్ కుమార్​ను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. గత 10 ఏళ్లుగా పోలీస్ శాఖలో బీసీ అధికారులపై ఈ వేధింపులు జరుగుతున్నాయని త్వరలో ఆయనకు ప్రమోషన్ ఉండటం వల్లనే ఇప్పుడు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని కోరారు.

"ఈరోజు ఉదయం విధులకు వెళ్లే సమయంలో అప్పా జంక్షన్​లో కొంత మంది మా నాన్నను అదుపులోకి తీసుకున్నారు. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో విషయం తెలిసింది. మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదు. ఎందుకు అరెస్టు చేశారో తెలియాలి. ఓ ఐపీఎస్ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే, సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి" అంటూ ఐపీఎస్ నవీన్ కుమార్ కుమారుడు సాహిత్ ఆందోళన వ్యక్తం చేశారు.

Dimple Hayathi Controversy : ఐపీఎస్ అధికారి Vs టాలీవుడ్ హీరోయిన్.. తప్పెవరిది..?

IAS Officer Abhishek Singh : సినిమాల కోసం IAS ఉద్యోగానికి రాజీనామా.. ఆ అధికారి కథేంటో తెలుసా?

Last Updated : Dec 27, 2023, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.