ETV Bharat / state

Minister Srinivas goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు భద్రత పెంపు

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు భద్రత పెంపు
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు భద్రత పెంపు
author img

By

Published : Mar 4, 2022, 11:13 AM IST

Updated : Mar 4, 2022, 11:35 AM IST

11:11 March 04

Minister Srinivas goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు భద్రత పెంపు

Minister Srinivas goud: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు భద్రత పెంచాలని ఇంటెలిజెన్స్‌ విభాగం నిర్ణయించింది. హత్య కుట్ర కోణం బయట పడటంతో భద్రత పెంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మంత్రి శ్రీనివాస్ గౌడ్ దిల్లీ పర్యటనలో ఉన్నారు. హైదరాబాద్‌ రాగానే అదనపు భద్రతా సిబ్బంది విధుల్లో చేరనున్నారు.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు 15 కోట్ల సుపారీతో కుట్ర జరిగిందని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. నిందితుల్లో రాఘవేంద్రరాజు నేరాన్ని అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. వ్యాపారాలతో పాటు ఆర్థికంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తనను.. దెబ్బతీసినందునే హత్యకు పథకం వేశామని అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో 8 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు పంపించారు. నిందితులు దిల్లీలోని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి నివాసంలో అదుపులోకి తీసుకోవడంతో రాజకీయ దుమారం రేగింది. మహబూబ్‌నగర్‌లోని అతని ఇంటిపైనా పలుమార్లు రాళ్ల దాడి జరిగింది. ఈ పరిణామాలన్నింటి దృష్య్టా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు భద్రత పెంచాలని ఇంటెలిజెన్స్‌ నిర్ణయించింది.

ఇదీ చదవండి:

Last Updated : Mar 4, 2022, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.