Holi Festival: హోలి సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నగర పరిధిలోని పశ్చిమ మండలం, దక్షిణ మండలంలోని పలు ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా వజ్ర వాహనాలతో పాటు... అదనపు బలగాలను తరలించేందుకు వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. కార్వాన్, టోలీచౌకి, జియాగూడ, అసిఫ్ నగర్, చార్మినార్, చంద్రాయణగుట్టతో పాటు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టారు.
బందోబస్తును నేరుగా డీసీపీలు పర్యవేక్షిస్తున్నారు. చార్మినార్ పరిసరాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించారు. 19వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయించకుండా నోటిఫికేషన్లు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలపై నిషేధం విధించారు. సంబంధంలేని వ్యక్తులు, వాహనాలు, భవనాలపై రంగులు చల్లొద్దని పోలీసులు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: