సచివాలయ తరలింపు ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు కార్యాలయాల తరలింపు ప్రణాళికను ఖరారు చేసిన సాధారణ పరిపాలన శాఖ... సంబంధిత సమాచారాన్ని ఆయా శాఖల కార్యదర్శులకు అందించింది. తాత్కాలికంగా సచివాలయ కార్యాలయాల తరలింపునకు సంబంధించిన సమాచారం, ప్రణాళిక, వివరాలను అధికారికంగా చేరవేశారు.
సీఎంవో మినహా
ఆగస్టు మూడు నుంచి తరలింపు ప్రక్రియ ప్రారంభించాలని పేర్కొన్నట్లు తెలిసింది. బీఆర్కే భవన్లో సంబంధిత శాఖలకు ప్రతిపాదించిన అంతస్తులోని నమూనా... కార్యదర్శి, విభాగాలకు ప్రతిపాదించిన నమూనాలను అందులో పొందుపరిచినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయం మినహా దాదాపుగా అన్ని శాఖల కార్యాలయాలను బూర్గుల రామకృష్ణారావు భవన్‌కే తరలించనున్నారు.
ఇదీ చూడండి: మిట్టమధ్యాహ్నం మహిళ మెడలోంచి గొలుసు చోరీ