ETV Bharat / state

సముద్ర మొక్కలతో ఆహార ఉత్పత్తుల తయారీ..! - ap latest news

సముద్ర మొక్కలతో వినూత్న ఉత్పత్తులను తయారు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే చైనా, జపాన్‌ వంటి దేశాల్లో ఆహార పదార్థాలుగా ఉపయోగిస్తున్న సీవీడ్‌ను ప్రస్తుతం భారత్‌లో కూడా ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖ, కొచ్చిన్‌లలోని కేంద్ర మత్స్య సాంకేతిక సంస్థ శాస్త్రవేత్తలు ఈ విధంగా కృషిచేస్తున్నారు.

సముద్ర మొక్కలతో ఆహార ఉత్పత్తుల తయారీ..!
సముద్ర మొక్కలతో ఆహార ఉత్పత్తుల తయారీ..!
author img

By

Published : Feb 25, 2021, 7:48 PM IST

సముద్ర మొక్కలతో ఆహార ఉత్పత్తుల తయారీ..!

సముద్రతీరాల్లో లభించే సీవీడ్‌లో అత్యల్ప కొవ్వుశాతం, అత్యధిక శాతంలో పీచు పదార్థాలు, మాంసకృత్తులు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబియల్‌ ఏజెంట్లు ఉంటాయి. వీటితో తయారుచేసిన పదార్థాలు తింటే క్యాన్సర్, గుండెపోటు తదితర ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతోందని శాస్త్రవేత్తల అధ్యయనాల్లో తేలిన విషయం. కొరియా, చైనా, జపాన్‌ తదితర దేశాల్లో సీవీడ్‌ ఉత్పత్తుల వినియోగం ఎక్కువగా ఉంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారతదేశం కూడా సీవీడ్‌ ఉత్పత్తుల అభివృద్ధిపై దృష్టిసారించింది.

సీవీడ్‌ ఉత్పత్తుల్లో భాగంగా సీఐఎఫ్​టీ శాస్త్రవేత్తలు ముమ్మరంగా పరిశోధనలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ శాస్త్రవేత్త డాక్టర్‌ జస్మి సీవీడ్‌ సాచెట్లను తయారుచేశారు. మసాలాలు ఇతర ఆహార ఉత్పత్తులను ఉంచి సీల్‌ చేయడానికి అనుకూలంగా ఆయా సాచెట్లు ఉంటాయి. కూరలు, నూడుల్స్‌ తదితర ఆహార పదార్థాలను వండుకునేటప్పుడు సీవీడ్‌ మసాలా ప్యాకెట్లను నేరుగా కలపవచ్చు. వేడినీటిలో ఆయా ప్యాకెట్లను కలిపితే మసాలాతోపాటు సీవీడ్‌తో తయారుచేసిన సాచెట్‌ కూడా కరిగిపోతుంది. ఫలితంగా సీవీడ్‌లో ఉండే పోషకాలు ఆయా ఆహారపదార్థాలకు తోడై వినియోగదారుల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అదే సమయంలో ఆయా సాచెట్లను తయారుచేయడానికి ప్లాస్టిక్‌ను వినియోగించాల్సిన అవసరం లేకుండా పోతోంది.

సీవీడ్‌పై విశాఖతోపాటు కేరళలోని కొచ్చిన్​లోని సీఐఎఫ్​టీ ప్రధాన కార్యాలయంలోనూ విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సీవీడ్‌తో ఇప్పటికే కుకీస్, నూడుల్స్, శీతలపానీయాలు, పాస్తా, సాసేజస్‌ తదితర ఉత్పత్తులెన్నింటినో తయారుచేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.