ETV Bharat / state

బీజేపీని ఆకట్టుకోవడానికే చంద్రబాబు 'ఖమ్మం సభ': సజ్జల - sajjala commenmts on DL

Sajjala Comments on CBN : బీజేపీకి దగ్గరయ్యేందుకే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖమ్మంలో సభ పెట్టారని.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబుకు ఎక్కడ రాజకీయం చేయాలనుకుంటున్నారో ఆయనకే స్పష్టత లేదన్నారు. బైజూస్ కంటెంట్​కు చాలా డిమాండ్ ఉంది కాబట్టి పిల్లలకు ఫ్రీగా ఇస్తున్నామని.. కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చేది ఉంటే చంద్రబాబు అప్పుడే ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

Sajjala Comments on CBN
Sajjala Comments on CBN
author img

By

Published : Dec 22, 2022, 8:26 PM IST

బీజేపీని ఆకట్టుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నారు: సజ్జల

Sajjala Comments on CBN: తెలంగాణలో బలం చూపి బీజేపీని ఆకట్టుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబు ఎందుకిలా మాట్లాడుతున్నారో.. చంద్రబాబు ఏ ప్రయోగం చేయబోతున్నారో తెలియదని అన్నారు. చంద్రబాబుకు ఆధార్, ఓటు కార్డు రెండూ తెలంగాణలోనే ఉన్నాయని.. ఏ రాష్ట్రంలో ఉండాలనుకుంటున్నారో స్పష్టత ఇవ్వాలని తెలిపారు.

డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీకి చాలా కాలంగా దూరంగా ఉన్నారని, ఆయన వైసీపీలో ఉన్నట్లు తాము భావించడం లేదన్నారు. ట్యాబుల పంపిణీలో అవకతవకలు అంటూ నోటికొచ్చినట్లు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని, ట్యాబ్​ల కొనుగోలు విషయంలో ఎక్కడా అవకతవకలు జరగలేదని తెలిపారు. అలాగే బైజూస్ కంటెంట్​కు చాలా డిమాండ్ ఉంది కాబట్టి పిల్లలకు ఫ్రీగా ఇస్తున్నామని అన్నారు.

కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చేది ఉంటే చంద్రబాబు అప్పుడే ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఈడబ్ల్యూఎస్​లో రిజర్వేషన్లపై గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం ఎక్కడా క్లారిటీగా చెప్పలేదన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.