తెలంగాణ ఆడబిడ్డల సంబురం.. సద్దుల బతుకమ్మ(saddula Bathukamma Song 2021). ఈ పండుగ వచ్చిందంటే చాలు.. ప్రతి ఆడపిల్ల ఎంతో ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో ఆ తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడుతుంది. ఒకప్పుడు బతుకమ్మ పండుగ రోజు.. ఆడవాళ్లే పాటలు పాడుతూ ఆడుకునే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రతి ఏడు బతుకమ్మ(saddula Bathukamma Song 2021) సీజన్లో పదిలకొద్ది పాటలను ప్రముఖ మ్యూజిక్ కంపెనీలు, యూట్యూబ్ ఛానెళ్లు రిలీజ్ చేస్తున్నాయి. ఇక సద్దుల బతుకమ్మ వేడుక(saddula Bathukamma Song 2021)లో ఆ పాటలే మార్మోగుతాయి. పండుగకు పదిహేను రోజుల ముందే ఈ ఛానెళ్లు బతుకమ్మ పాటలు రిలీజ్ చేస్తాయి. అప్పటినుంచి అవి ప్రతి మహిళ నోట్లో మెదులుతూనే ఉంటాయి. సద్దుల రోజు కూడా అవే పాటలు పాడుతూ బతుకమ్మ(saddula Bathukamma Song 2021) ఆడుతుంటారు.
అయితే ఈ ఏడు మన బతుకమ్మ(saddula Bathukamma Song 2021) పాటకు అంతర్జాతీయ గుర్తింపు రానుంది. ప్రతియేడు మాదిరి ఈ ఏడు కూడా బతుకమ్మ పాటలు రూపొందించారు. అందులో అందరు ఆసక్తికరంగా ఎదురుచూసేది మాత్రం ఒక పాట కోసం. ఎందుకు ఆ పాటకు అంత ప్రాముఖ్యత అంటే. అది రూపొందించింది సాధారణ వ్యక్తులు కాదు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కలిసి ఈయేడు ఓ బతుకమ్మ పాటను రూపొందించారు. ఈ పాటను ప్రముఖ గాయని పాడారు. ఇటీవల హైదరాబాద్ సమీపంలోని భూదాన్ పోచంపల్లిలో దృశ్యచిత్రీకరణ జరిపారు. రాష్ట్రంలో 6 నుంచి బతుకమ్మ పండుగ(saddula Bathukamma Song 2021) ప్రారంభం కానుంది. ఆ లోపే పాటను విడుదల చేస్తారు. ఈ గీతాన్ని ఇతర భాషల్లోకి సైతం అనువదించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
- ఇదీ చదవండి : బతుకమ్మను బతికిస్తున్న మహిళలు