ETV Bharat / state

వరద బాధితులకు అండగా నిలిచిన సబీల్ ట్రస్ట్ - వరద బాధితులు

వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు మహబూబ్​నగర్ సబీల్ ట్రస్ట్ అండగా నిలిచింది. రెండో విడతలో భాగంగా గురువారం హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్టలో 200 మంది వరద బాధితులకు... ట్రస్ట్ ఫౌండర్​, కార్యదర్శి మౌలానా మొహమ్మద్ నాయీమ్ కౌసర్ రాష్షాది సరకుల కిట్, నగదు అందజేశారు.

sabil trust help to flood victims in hyderabad
వరద బాధితులకు అండగా నిలిచిన సబీల్ ట్రస్ట్
author img

By

Published : Oct 29, 2020, 9:21 PM IST

Updated : Oct 29, 2020, 9:39 PM IST

హైదరాబాద్​లో వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు మహబూబ్​నగర్ సబీల్ ట్రస్ట్ అండగా నిలిచింది. సబీల్ ట్రస్ట్ ఫౌండర్​, కార్యదర్శి పాతబస్తీలోని ఉప్పుగూడ శివాజీనగర్, అల్ జుబైల్ కాలనీ, అలీనగర్, బాబానగర్, రాయల్ కాలనీలో 400 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.6 వేల విలువైన కిట్​ అందించారు. కిట్​లో బియ్యం, పప్పులు, నూనె, సబ్బులు, వంటసామగ్రి, పాత్రలు, గిన్నెలు, బ్లాంకిట్లు, బకెట్లు ఉన్నాయి.

గురువారం హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట ఒమర్ గుల్షన్ ఫంక్షన్ హాల్​లో రెండో విడతలో భాగంగా.. 200 మంది వరద బాధితులకు ఒక్కొక్కరికి రూ. 4500 సరకుల కిట్, రూ.1500 నగదు సబీల్ ట్రస్ట్ ఫౌండర్​, కార్యదర్శి మౌలానా మొహమ్మద్ నాయీమ్ కౌసర్ రాష్షాది, ముఖ్యఅతిధి హుసముద్దీన్ సాని జాఫర్ పాషా అందజేశారు. వచ్చే సోమవారం మరో 200 మంది వరద బాధితులకు కిట్లు అందజేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: ధరణి.. భారతదేశానికే ట్రెండ్ సెట్టర్: సీఎం కేసీఆర్

Last Updated : Oct 29, 2020, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.