కనుచూపు మేరంతా పచ్చదనం... మధ్యలో చూడచక్కని జలపాతం. ఇదీ... ఏపీలోని విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలంలో ఉన్న కొత్తపల్లి జలపాతం. హొయలుపోతున్న ఈ ప్రకృతి అందాన్ని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి పర్యటకులు పెద్ద సంఖ్యలో వచ్చి సందడి చేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా... జలపాతంలో తడుస్తూ సందడి చేశారు. జలపాత అందాలు కెమెరాల్లో బంధిచేందుకు ఉత్సాహం చూపించారు. సెల్ఫీలతో యువతీ యువకులు హంగామా చేశారు.
ఇవీ చూడండి : చేపలవేటకు వెళ్లి విద్యుదాఘాతంతో యువకుడు మృతి