Rs 1 Lakh To Minorities : రాష్ట్రంలో బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తి రాయితీపై అందచేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా మైనారిటీల ఆర్థిక స్వావలంబన దిశగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని సర్కారు ఆవిష్కరించింది. సమాజంలో కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
Minorities 1 Lakh Scheme in Telangana : ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. విద్యా, ఉపాధి సహా పలు రంగాల్లో ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మైనార్టీల్లోని పేదరికం, వెనుకబాటు తొలగించేందుకు కృషి కొనసాగుతుందని చెప్పారు. ఈ దిశగా ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన కార్యాచరణ మంచి సత్పలితాలు అందిస్తుందని స్పష్టం చేశారు. భిన్న సంస్కృతులు, విభిన్న మత ఆచార సాంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ రాష్ట్రంలో గంగా జమున తహజీబ్‌ను కాపాడే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
'మైనార్టీలకు రూ.లక్ష ఆర్థికసాయం పూర్తి సబ్బిడీతో అందించాలి. కులమతాలకు అతీతంగా పేదల అభివృద్ధికి ప్రభుత్వం పనిచేస్తోంది. మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. భిన్న సంస్కృతులు, మతాచారాలను ప్రభుత్వం సమానంగా ఆదరిస్తోంది. రాష్ట్రంలో గంగా జమున తహజీబ్‌ను కాపాడే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది.'-ముఖ్యమంత్రి కేసీఆర్
లక్ష ఆర్థిక సాయానికి ఉండాల్సిన అర్హతలివే : సామాజిక లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రూపొందిన అనేక పథకాల జాబితాలో ఇప్పుడు 'మైనారిటీలకు లక్ష ఆర్థిక సాయం' అందించే పథకం కూడా చేరనుంది. వారసత్వ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వెనుకబడిన తరగతుల సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్కీమ్‌ను వినియోగించుకునేందుకు అర్హతలను విడుదల చేసింది. జూన్ 2, 2023 నాటికి, గ్రహీత తప్పనిసరిగా 21 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి, ఒక గ్రాంట్ మాత్రమే ఇస్తామని తెలిపింది. లబ్ధిదారుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదని తెలిపింది. ఇంతకు ముందు ఏదైనా సంక్షేమ కార్యక్రమాలను వినియోగించుకున్న లబ్ధిదారులు అనర్హులని ప్రకటించింది. తెలంగాణలోని వెనుకబడిన తరగతుల కళాకారులు, వృత్తిపరమైన సంఘాలు మాత్రమే ఈ కార్యక్రమానికి నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.
ఇవీ చదవండి :