భవితరాల బంగారు భవిష్యత్ కోసం పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ నేత లక్ష్మీనారాయణ అన్నారు. పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు రీయూజ్, రీసైకిల్, రీవీవ్ అనే త్రిబుల్ ఆర్ పేరుతో రూపొందించిన యాప్‌ను జూబ్లీహిల్స్‌లోని జేడీ ఫౌండేషన్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా యాప్‌ను రూపొందించిన నేచుర్‌కేర్ ఇన్నోవేషన్ సర్వీస్ ప్రతినిధులను అభినందించారు. ప్లాస్టిక్ వినియోగం అనేక అనార్థలకు కారణమవుతుందని అందుకే తమ ఫౌండేషన్ ద్వారా నో ప్లాస్టిక్ ఉద్యమం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను పెంచే విధంగా వారిలో అవగాహన కల్పించాలని సూచించారు.
ఇవీ చూడండి: WC19:రోహిత్ శతకం- కప్ వేటలో భారత్ బోణీ