హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్‌కి చెందిన ఇంరోజ్ బాషా మద్యం మత్తులో అతి వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇంరోజ్ అక్కడికక్కడే మృతి చెందాగా.. అతని స్నేహితునికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపుగా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: ప్రాణవాయువు అందక వ్యాధిగ్రస్తురాలు మృతి