ETV Bharat / state

Revanth visits martyrs stupa: 'సచివాలయం మీదున్న శ్రద్ధ.. అమరవీరుల స్తూపంపై లేదు' - revanth reddy comments in kcr

Revanth visits martyrs stupa: సీఎం కేసీఆర్​కు సచివాలయం మీదున్న శ్రద్ధ.. అమరవీరుల స్థూపంపై లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి విమర్శించారు. స్తూపం నిర్మాణ పనులపై సమీక్షించే తీరిక కేసీఆర్​కు లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్​లో అమరవీరుల స్మారకం నిర్మాణ పనులను పరిశీలించిన రేవంత్​.. గుత్తేదారుడిని పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

revanth reddy
రేవంత్​ రెడ్డి
author img

By

Published : Dec 11, 2021, 3:35 PM IST

Updated : Dec 11, 2021, 5:20 PM IST

Revanth visits martyrs stupa: తెలంగాణ అమరవీరుల స్తూపం ప్రపంచం ఆశ్చర్యపోయేలా నిర్మిస్తామని చెప్పి.. ఏడేళ్లు గడిచినా సీఎం కేసీఆర్​ పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అమరుల కుటుంబాలకు ఉద్యోగం, ఆర్థిక సాయం, భూమి ఇస్తామని ఇప్పటికీ ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం ఎదుట నిర్మాణంలో ఉన్న అమరవీరుల స్మారక భవనాన్ని రేవంత్ రెడ్డి పరిశీలించారు. భవన నిర్మాణానికి సంబంధించిన వివరాలను నిర్మాణదారుడి సూపర్‌వైజర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు సచివాలయం మీదున్న శ్రద్ధ.. అమరవీరుల స్తూపంపై లేదని రేవంత్‌ విమర్శించారు. స్మారకం నిర్మాణంపై సమీక్షించే తీరిక సీఎంకు లేదని వ్యాఖ్యానించారు.

స్థూపాన్ని నిర్మిస్తున్నవారు తెలంగాణ వారు కాదు: రేవంత్‌రెడ్డి

ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వందలాది విద్యార్థుల స్మరణకు ఈ స్మారక స్తూపం చిహ్నం. స్మారక భవనం నిర్మాణం చేపట్టి ఇప్పటికి ఏడేళ్లు దాటింది. అయినా పూర్తి కాలేదు. కేసీఆర్‌కు సచివాలయం మీదున్న శ్రద్ధ అమరవీరుల స్తూపంపై లేదు. అమరవీరుల స్మారకం నిర్మాణంపై సమీక్షించే తీరిక సీఎంకు లేదు. స్తూపాన్ని నిర్మిస్తున్నవారు కూడా తెలంగాణ వాసులు కాదు. ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా గుత్తేదారుకు స్మారక స్తూపం నిర్మాణ కాంట్రాక్టు ఇచ్చారు. నిర్మాణానికి తెలంగాణ బిడ్డలు ఎవ్వరూ సరిపోరా.? - రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

పక్క రాష్ట్రానికి కాంట్రాక్టు

Revanth reddy comments on kcr: అమరవీరుల స్తూప నిర్మాణం కోసం 2017 లో కేసీఆర్​ రూ. 80కోట్లు కేటాయించి.. 2018 లో టెండర్ పిలిచారని రేవంత్​ పేర్కొన్నారు. టీ హబ్‌ నిర్మాణంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని కాగ్ చెప్పిన సంస్థకే స్తూపం నిర్మాణ పనులను ప్రభుత్వం అప్పగించిందని ఆక్షేపించారు. ఆంధ్రా కాంట్రాక్టర్‌కు పనులు ఇచ్చినందుకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజం నుంచి కేసీఆర్‌ కుటుంబాన్ని వెలివేయాలని రేవంత్​ రెడ్డి అన్నారు.

ఇదీ చదవండి: Bandi Sanjay comments on KCR: 'కలెక్టర్లకు కేసీఆర్​.. ఎమ్మెల్సీ పదవుల ఆశ చూపుతున్నారు'

Last Updated : Dec 11, 2021, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.