ETV Bharat / state

రాష్ట్ర ప్రజలతో సీఎం కేసీఆర్​కు పేగుబంధం తెగిపోయింది: రేవంత్‌రెడ్డి - సజ్జల వ్యాఖ్యలపై రేవంత్​రెడ్డి ఫైర్

Revanthreddy Comments on BRS Party: రాష్ట్ర ప్రజలతో సీఎం కేసీఆర్​కు పేగుబంధం తెగిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రికి తెలంగాణపై ఏనాడూ ప్రేమలేదని... ఈసీకి కేసీఆర్‌ లేఖ రాసిన అడ్రసులోనూ ఏపీగా పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేత మాటల్ని సీఎం ఎందుకు ఖండించడంలేదని ప్రశ్నించారు.

Revanthreddy
Revanthreddy
author img

By

Published : Dec 9, 2022, 1:35 PM IST

Updated : Dec 9, 2022, 1:48 PM IST

Revanthreddy Comments on BRS Party: బీఆర్​ఎస్​కు ఈసీ ఆమోదం తెలపడంతో సీఎం కేసీఆర్​ను ఉద్దేశిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలతో సీఎం కేసీఆర్‌కు బంధం తెగిపోయిందని రేవంత్‌ విమర్శించారు. పేగు బంధంతో పాటు పేరు బంధం కూడా తెగిపోయిందని ఆరోపించారు.

టీఆర్​ఎస్, బీజేపీ నేతలు బహిరంగంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నా.. వారి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి తెలంగాణపై ఏనాడూ ప్రేమలేదని... ఈసీకి కేసీఆర్‌ లేఖ రాసిన అడ్రసులోనూ ఏపీగా పేర్కొనడంపై రేవంత్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పేరునే కాదు... మనుగడను చెప్పుకోవడం లేదన్నారు. 2 రాష్ట్రాలను కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేత మాటల్ని సీఎం ఎందుకు ఖండించడంలేదని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రజలతో సీఎం కేసీఆర్​కు పేగుబంధం తెగిపోయింది: రేవంత్‌రెడ్డి

'తెలంగాణ ప్రజలతో సీఎం కేసీఆర్‌కు బంధం తెగిపోయింది. పేగు బంధంతో పాటు పేరు బంధం కూడా తెగిపోయింది. ఈసీకి కేసీఆర్‌ లేఖ రాసిన అడ్రసులోనూ ఏపీగా పేర్కొనడం జరిగింది. 2 రాష్ట్రాలను కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలని చూస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను కేసీఆర్‌, కేటీఆర్‌ ఖండించలేదు. అంటే సజ్జల చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్‌ సంపూర్ణ మద్దతిస్తున్నట్టుగానే ఉంది.'-రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఘనంగా సోనియాగాంధీ పుట్టిన రోజు వేడుకలు.. ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌ బోయిన్​పల్లిలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. గాంధీ ఐడియాలజీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్​రెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 9, 2022, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.