ETV Bharat / state

బీజేపీ కోసమే కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేస్తున్నారు: రేవంత్‌రెడ్డి - kcr luring Karnataka Congress MLAs

Revanth Reddy Comments on KCR కేసీఆర్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి.. ఆయనను కాంగ్రెస్ ఎప్పుడూ నమ్మదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు కేసీఆర్ చేస్తున్న కుట్ర బయటపడిందని ఆరోపించారు. బీజేపీ కోసమే ముఖ్యమంత్రి.. జాతీయ రాజకీయాలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

Revanth Reddy
Revanth Reddy
author img

By

Published : Jan 22, 2023, 3:40 PM IST

Revanth Reddy Comments on KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. బీజేపీ కోసమే.. కేసీఆర్‌ జాతీయ రాజకీయాలు అంటూ బయలుదేరారని ఆరోపించారు. కర్ణాటక కాంగ్రెస్ నేతలు కొందరు కేసీఆర్‌ను కలిశారని.. తాను చెప్పింది నిజమని బయట పడిందని చెప్పారు. పైలెట్ రోహిత్‌రెడ్డి.. తనను కేసీఆర్‌తో కలిపించారని.. కర్ణాటక కాంగ్రెస్ నేత జమీర్ స్వయంగా చెప్పారని అన్నారు. రోహిత్‌రెడ్డి పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక వ్యక్తి అని పేర్కొన్నారు. హైదరాబాద్​ గాంధీభవన్‌ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో.. సీఎం కేసీఆర్ బేరసారాలు చేశారు: కుమారస్వామి లాంటి నేతలు కలిసినప్పుడు బయటకు ఇచ్చిన సమాచారం.. వ్యాపారం కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే కలిసినప్పుడు ఎందుకు గోప్యంగా ఉంచారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో.. సీఎం కేసీఆర్ బేరసారాలు చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వారు ఈ డీల్‌కు ఒప్పుకోలేదని తెలిపారు. తాను చేసిన ఆరోపణలకు.. ఆధారాలు బయటకు వచ్చాయని వివరించారు.

కేసీఆర్ చేస్తున్న కుట్ర బయటపడింది: కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు.. కేసీఆర్ చేస్తున్న కుట్ర బయటపడిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. అక్కడ ఏం జరుగుతుందో తాను కామెంట్ చేయనని పేర్కొన్నారు. కేసీఆర్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి.. ఆయనను కాంగ్రెస్ ఎప్పుడూ నమ్మదని స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను దెబ్బతీస్తే.. బీజేపీకి లాభం జరుగుతుందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

అసలేం జరిగిదంటే: కొద్ది రోజుల క్రితం కర్నాటకలో 25 మంది కాంగ్రెస్ నేతలతో సీఎం కేసీఆర్​ ఇటీవల మాట్లాడి... వారికి 500కోట్ల రూపాయలు ఆఫర్‌ ఇచ్చారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తక్కువ మెజారిటీతో గెలిచే నేతలను లక్ష్యంగా పెట్టుకుని కేసీఆర్ ఆపరేషన్ ప్రారంభించారని విమర్శించారు. ఈ విషయం కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలియడంతో వారిని ఏఐసీసీ పిలిచి మాట్లాడిందని తెలిపారు. ఈ విషయం కుమారస్వామికి కూడా తెలియదని రేవంత్‌రెడ్డి వివరించారు.

ఫిబ్రవరి 6 నుంచి రెండు నెలల పాటు హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర: రాష్ట్రంలో ఫిబ్రవరి 6 నుంచి రెండు నెలల పాటు హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర కొనసాగుతుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రియాంక లేదా సోనియాగాంధీ ఒక రోజు యాత్రలో పాల్గొనేలా సమావేశంలో తీర్మానించినట్టు చెప్పారు. ఈనెల 26న భద్రాచలం నుంచి లాంఛనంగా యాత్రను ప్రారంభించనున్నట్టు రేవంత్‌రెడ్డి వివరించారు.

ఇవీ చదవండి: 'హాత్‌ సే హాత్‌ జోడో'పై కురదరని ఏకాభిప్రాయం.. ఇంకెప్పుడో మరి?

సీఎంకు రాత్రి 2 గంటలకు స్టార్ హీరో ఫోన్​.. షారుక్​ ఎవరో తెలియదన్న కొద్ది గంటలకే..

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.