ETV Bharat / state

పెరుగుతున్న ధరలు.. ఆదాయం లేక కుంగుతున్న పేదలు! - చేతివృత్తిదారులు, వ్యవసాయ కూలీ కుటుంబాల పరిస్థితి దారుణం

ఏపీలో నిత్యావసర సరకుల ధరలు కళ్లెం లేనట్లు పెరుగుతున్నాయి. ఏడేళ్ల క్రితంతో పోలిస్తే.. బియ్యం ధరలు 24% పెరిగాయి. చింతపండు ఏకంగా 118% అధికమైంది. వంట నూనెలు, పప్పుల ధరలూ 60% పైనే ఎగశాయి. చేతివృత్తిదారులు, వ్యవసాయ కూలీల ఆదాయం మాత్రం సగటున 60% లోపే పెరిగింది. 2019-20తో పోల్చితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో నిత్యావసరాల ధరలు 39% వరకు పెరగ్గా.. పేదల ఆదాయంలో పెరుగుదల 13% మించలేదు. 2020-21 ఆర్థిక సామాజిక సర్వేలో ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

rates
rates
author img

By

Published : Jun 12, 2021, 8:09 AM IST

ఆంధ్రప్రదేశ్​లో నిత్యావసరాల ధరల పెరుగుదలతో.. పేద కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోంది. నలుగురు ఉండే కుటుంబంలో సగటున నెలకు 50 కిలోల బియ్యం వినియోగిస్తారు. కిలోకు 6.11 చొప్పున పెరిగితే నెలకు రూ.305, ఏడాదికి రూ.3,666 ఖర్చు పెరిగినట్లే. నెలకు 4 లీటర్ల నూనె రూపంలో.. ఏడాదికి రూ.2,400 అదనపు భారమే. ఉల్లి నెలకు 3 కిలోల లెక్కన చూసినా రూ.400 పైన అదనంగా మోయాల్సి వస్తుంది. పప్పులు, చింతపండు, మిర్చి.. తదితర నిత్యావసరాలనూ కలిపితే.. ఒక్కో కుటుంబంపై సగటున ఏడాదికి రూ. 7-8 వేల వరకూ ఖర్చులు పెరుగుతున్నాయి.

ఏడాదికి రూ.7వేల పైనే నిత్యావసరాల భారం

నిత్యావసరాల ధరల పెరుగుదలతో.. పేద కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోంది. నలుగురు ఉండే కుటుంబంలో సగటున నెలకు 50 కిలోల బియ్యం వినియోగిస్తారు. కిలోకు 6.11 చొప్పున పెరిగితే నెలకు రూ.305, ఏడాదికి రూ.3,666 ఖర్చు పెరిగినట్లే. నెలకు 4 లీటర్ల నూనె రూపంలో.. రూ.2,400 అదనపు భారమే. ఉల్లి నెలకు 3 కిలోల లెక్కన చూసినా రూ.400 పైన అదనంగా మోయాల్సి వస్తుంది. పప్పులు, చింతపండు, మిర్చి.. తదితర నిత్యావసరాలనూ కలిపితే.. ఒక్కో కుటుంబంపై సగటున ఏడాదికి రూ. 7-8 వేల వరకూ ఖర్చులు పెరుగుతున్నాయి.

ధరల స్థాయిలో పెరగని ఆదాయం

చేతివృత్తిదారులు, వ్యవసాయ కూలీల కుటుంబాల్లో పని దొరికితేనే రోజు గడుస్తుంది. నిత్యావసరాల ధరల స్థాయిలో వీరి ఆదాయం పెరగలేదు. స్వర్ణకారులకు ఏడేళ్లలో రూ.107 మాత్రమే కూలీలో పెరుగుదల కన్పించింది. అంటే ఏడాదికి రూ.16లోపే. 2019-20తో పోలిస్తే.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వీరి ఆదాయంలో పెరుగుదల సగటున 13% లోపే ఉంది. ఈ కాలంలో వడ్రంగి పనివారికి 9.17%, స్వర్ణకారులకు 5.71%, చర్మకారులకు 7.71%, వ్యవసాయ కూలీల్లో పురుషులకు 13.04%, మహిళలకు 12.03% చొప్పున మాత్రమే రోజు కూలీ పెరిగింది.

- ఈనాడు, అమరావతి

ఇదీ చదవండి: పర్యాటక రంగంపై కరోనా పిడుగు.. దుర్భర స్థితిలో గైడ్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.