తిరుమలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నందున ఇప్పటికైనా శ్రీవారి దర్శనాలను నిలుపుదల చేయాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ట్విటర్ వేదికగా తితిదే సలహా మండలి గౌరవాధ్యక్షులు రమణ దీక్షితులు కోరారు. శ్రీవారి అర్చకుల స్థానం ఎవరూ భర్తీ చేయలేనిదని, వారి ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా దర్శనాలను నిలుపుదల చేయాలని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీవారి కైంకర్యాలు ఒకరోజు కూడా ఆగడానికి వీల్లేదని.. ఇది మానవజాతికి మంచిది కాదని పేర్కొన్నారు. కొన్ని వారాల పాటు దర్శనాలను నిలుపుదల చేసి శ్రీవారి కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించాలని కోరారు.
ఇదీ చూడండి: అత్యధిక కొవిడ్ బాధితులకు ఆ మూడింట్లో ఏదో ఒక సమస్య