ETV Bharat / state

'స్పందించకపోతే రైల్వే సమ్మె తప్పదు'​

కార్మికుల హక్కులను కాలరాస్తూ, చట్టాలను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సౌత్​సెంట్రల్​ రైల్వే మజ్దూర్​ యూనియన్​ జాతీయ కార్యదర్శి సీ హెచ్​ శంకర్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనస్​ దినోత్సవం సందర్భంగా నాంపల్లి సౌత్​ సెంట్రల్​ రైల్వే యూనియన్​ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

author img

By

Published : May 9, 2019, 3:53 PM IST

railway-mazdur-sangh

కాంగ్రెస్​, భాజపా ప్రభుత్వాలు కార్మికులకు ఇన్సెంటివ్స్​, ప్రమోషన్స్​ లేకుండా చేశాయని సౌత్​సెంట్రల్​ రైల్వే మజ్దూర్​ యూనియన్​ జాతీయ కార్యదర్శి సీహెచ్​ శంకర్​రావు ఆరోపించారు. నూతన పింఛన్​ విధానంతో కార్మికులు తీవ్రంగా నష్టంపోతున్నారన్నారు. పాత పింఛన్​ విధానాన్ని ప్రవేశపెట్టే వరకూ పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రైల్వే కార్మికుల సమ్మె తప్పదని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలోకి రాబోయే కొత్త ప్రభుత్వమైనా తమకు అండగా ఉంటుందని ఆశాభావం వ్యంక్తం చేశారు.

'స్పందించకపోతే రైల్వే సమ్మె తప్పదు'​

ఇదీ చదవండి: భువనేశ్వర్ నుంచి రైల్వే సేవలు పునఃప్రారంభం

Hyd_Tg_20_09_Railway Mazdur Sangh Meeting_Ab_C1 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ, చట్టాలను మారుస్తూ, కార్మికుల సంఘాల మనుగడ లేకుండా చేస్తుందని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యదర్శి సి హెచ్ శంకర్రావు తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ యూనియన్ కార్యాలయంలో బొనస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాంపల్లి కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ... బోనస్ కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాడి సాధించుకున్న రోజు 1974 మే 8 అని తెలిపారు. ఇది ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లికింప దగ్గ రోజు అని వివరించారు. దీని ఫలితంగానే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు బొనస్ పొందడం జరిగుతుందని అన్నారు. 1974లో అప్పటి ఇందిరాగాంధీ నియంతృత్వ పాలనకు నేటి మోడీ పాలనకు తేడాలేదన్నారు. కాంగ్రెస్, భాజపా ప్రభుత్వాలు కార్మికులకు ఇన్సెంటివ్స్, ప్రమోషన్స్ లేకుండా చేస్తూ నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశ పెట్టిందని విమర్శించారు. పాత పెన్షన్ విధానం ప్రవేశ పెట్టె వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే రైల్వే కార్మికుల సమ్మె తప్పదని హెచ్చరించారు. 7 వ వేతన సవరణ ద్వార కార్మికులు కనీస వేతన సదుపాయాలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కేంద్రంలో రాబోయే కొత్త ప్రభుత్వం కార్మికులకు అన్ని విధాల అండదండగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బైట్: శంకర్ రావు, సౌత్ సెంట్రల్ రైల్వే మాజ్దుర్ యూనియన్ జాతీయ కార్యదర్శి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.