వృద్ధాప్య పింఛన్లపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఈ నెల నుంచి రూ.2,750కు పెంచి ఇవ్వాలని లేఖలో కోరారు. ఏడాదిగా పెండింగ్లో ఉన్న పింఛన్ కూడా కలిపి రూ.3 వేలు ఇవ్వాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.
వృద్ధాప్య పింఛను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారం సందర్భంగా హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి జగన్‌కు రఘురామకృష్ణరాజు గుర్తు చేశారు. ఈ హామీతో ప్రజల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభించిందని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: Black Fungus: వ్యాధికి చికిత్స ఉందా?