ఇదీ చూడండి: ఖమ్మం జిల్లా కార్మికశాఖ అధికారి ఆనంద్‌రెడ్డి హత్య
ఏపీ పంచాయతీ మంత్రి ఇలాఖాలో ప్రజాస్వామ్యం అపహాస్యం - లోకల్ ఎలక్షన్స్ న్యూస్
ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలోనే నామినేషన్ల పర్వంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో.. తెదేపా నాయకుల చేతుల్లో నుంచి వైకాపా నాయకులు పత్రాలు లాక్కొని వెళ్లిన దుస్థితి నెలకొంది. చౌడేపల్లి మండలంలోని తెదేపా అభ్యర్థి నామినేషన్ పత్రాలను వైకాపా కార్యకర్తలు లాక్కెళ్లారు. చేసేదేమీ లేక నామినేషన్ వేయనివ్వట్లేదని.. తెదేపా, జనసేన నాయకులు రోడ్డుపై బైఠాయించారు. కాగతి ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థి గనమ్మ చేతిలోంచి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లారు.
పంచాయతీ మంత్రి ఇలాఖాలో ప్రజాస్వామ్యం అపహాస్యం