ETV Bharat / state

రేపటి నుంచే ఐదు పథకాలకు దరఖాస్తు స్వీకరణ - రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ : సీఎం రేవంత్

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 27, 2023, 1:23 PM IST

Updated : Dec 27, 2023, 8:01 PM IST

Praja Palana Application Form Telangana 2023 : హైదరాబాద్​లోని సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తును సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రులు విడుదల చేశారు. గురువారం నుంచి మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత ఐదు పథకాలకు ప్రభుత్వం అప్లికేషన్​లను స్వీకరించనుందని తెలిపారు.

Prajapalan Application in Telangana
CM Revanth Reddy Released Prajapalan Application
ప్రజాపాలన దరఖాస్తు ఫారం ఇదే ఐదు పథకాలకు ఒకే అప్లికేషన్

Praja Palana Application Form Telangana 2023 : ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను అమలు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు పరచగా మహాలక్ష్మి పథకంతో కలిపి మిగిలిన గ్యారంటీలకు గురువారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో ఐదు పథకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అప్లికేషన్ ఫామ్​ను విడుదల చేశారు. ఐదు పథకాలకు ఒకే అప్లికేషన్ ఉంటుందని వివరించారు.

Telangana Prajapalana Applications : మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి(Gruha Jyothi Scheme in Telangana), ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రజాపాలన కార్యక్రమంలో ప్రారంభమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారులు ఈ విషయంపై ప్రతి ఒక్కరికీ వివరిస్తారని, ఎవరు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. అర్హులైన వ్యక్తులు గురువారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.

'తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించాం - విభజన చట్టంలో రావాల్సిన హక్కులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది'

Telangana Prajapalana Applications
Praja Palana Application Form Telangana 2023

5 Schemes Application in Telangana : ప్రజాపాలన కార్యక్రమాన్ని(Prajapalana Scheme in Telangana) ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోందని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు కృషి చేస్తోందని తెలిపారు. ఈనెల 28వ తేదీ నుంచి గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్‌ వార్డుల్లో పథకం అమలు అవుతోందని చెప్పారు. ఎనిమిది పని దినాల్లో గ్రామ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ జరగనుందని వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందించాలని నిర్ణయం తీసుకన్నామని పేర్కొన్నారు.

"అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయి. గత ప్రభుత్వ అవినీతిపై శ్వేతపత్రాలు విడుదల చేశాం. రూ.6.71 లక్షల కోట్లు అప్పు లు చేసి నిండా ముంచారు. పరిస్థితుల నుంచి తేరుకుని ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతమైంది. ఆటో డ్రైవర్ల పరిస్థితి ముందే ఊహించాం. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకుంటాం."- రేవంత్​ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి

CM Revanth Reddy on Six Guarantees : వారంలో రెండ్రోజులపాటు ప్రజావాణి కార్యక్రమం చేపడతామని రేవంత్​ అన్నారు. ప్రజావాణిలో ఇప్పటివరకు 24 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. భూములు, ఇళ్లు లేని వారు, ఆరోగ్యశ్రీ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. ఫిర్యాదులను అధికారులకు పంపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లడం ద్వారా న్యాయం చేసేందుకు యత్నం చేస్తున్నామన్నారు. ప్రతి మండలానికి తహశీల్దార్‌ బాధ్యత వహిస్తారని చెప్పారు. ప్రతి అధికారి రోజూ రెండు గ్రామాలను సందర్శిస్తారని అన్నారు. జనవరి 7లోపు లబ్ధిదారుల వివరాలు సేకరించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.

అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు : సీఎం రేవంత్​ రెడ్డి

"ప్రజావాణి కార్యక్రమం విజయవంతం అవుతుంది. సమస్య పరిష్కారం కాలేదని ఓ మహిళ కేటీఆర్‌ను కలిసిందని తెలిసింది. బాధిత మహిళకు కేటీఆర్‌ రూ.లక్ష అందించినట్లు తెలిసింది. ఆయన దోచుకున్న రూ.లక్ష కోట్లలో బాధితురాలికి రూ.లక్ష ఇచ్చారు. దోచుకున్న సొమ్ము మొత్తం ప్రజలకు చేరేలా చేస్తాం. కేసీఆర్‌ హయాంలో 22 కొత్త కార్లు కొని దాచిపెట్టారు. మూడోసారి అధికారంలోకి వస్తే కార్లు వాడుదామనుకున్నారు. ఐటీఐఆర్‌ కారిడార్‌ వెనక్కి పోతుంటే కేంద్రాన్ని నిలదీయలేదు." - రేవంత్​ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి

ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలులో అధికారులదే కీలక పాత్ర : సీఎం రేవంత్​ రెడ్డి

CM Revanth Reddy on Rythu Bharosa : రైతుబంధుకు సంబంధించి ఎలాంటి పరిమితి విధించలేదని రేవంత్​ స్పష్టం చేశారు. మేడిగడ్డకు సంబంధించి న్యాయ విచారణ జరుగుతోందన్నారు. విచారణ తర్వాత ఎల్‌ అండ్‌ టీ, అధికారుల పాత్ర ఏమిటనేది తెలుస్తుందని హెచ్చరించారు. కేంద్ర నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకువస్తామని చెప్పారు.

రాష్ట్రంలో డ్రగ్స్, నకిలీ విత్తనాలు అనే పదాలు వినిపించేందుకు వీల్లేదు - పోలీసులకు సీఎం కీలక ఆదేశాలు

Last Updated : Dec 27, 2023, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.