ETV Bharat / state

'రాజకీయాలకతీతంగా కరోనా నిర్మూలనకు కృషి చేయాలి'

author img

By

Published : May 21, 2021, 7:08 PM IST

మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్​లో కాంగ్రెస్ కార్యకర్తలు పీపీఈ కిట్లు. మాస్కులు అందజేశారు. కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ముషీరాబాద్​ నియోజకవర్గం ఇన్​ఛార్జి అనిల్​ కుమార్​ యాదవ్ అన్నారు.

ppe kits and masks distribution in hyderabad
కాంగ్రెస్​ ఆధ్వర్యంలో పీపీఈ కిట్లు, మాస్కుల పంపిణీ

కరోనా మహమ్మారి నిర్మూలనలో రాజకీయాలకతీతంగా ప్రజలను ఆదుకోవాలని యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్​ఛార్జి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్​లోని దోమలగూడ, గాంధీ నగర్, అడిక్​మెట్​ ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు మాస్కులు పంపిణీ చేశారు.

కరోనా మహమ్మారి నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అనిల్​కుమార్​ విమర్శించారు. కరోనా కట్టడికి వ్యాక్సిన్ రెండో డోసు కూడా వేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు కవిత, మహేష్, కృష్ణ, రాజు, వెంకట రెడ్డి, విక్కీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: యాదాద్రిలో జాలరులకు చిక్కిన వింత చేప

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.