Secunderabad Gold Theft Case Update : ఐటీ అధికారుల ముసుగులో సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్ పరిధిలోని జ్యూవెలరీ కార్ఖానాలో జరిగిన చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మోండా మార్కెట్లోని మధుకర్ అనే వ్యాపారికికి చెందిన కార్ఖానాలో.. ఐటీ అధికారులమని నమ్మించి 1700 గ్రాముల బంగారంతో ముఠా ఉడాయించింది. నిందుతుల కోసం 5 ప్రత్యేక బృందాలతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా గాలిస్తున్నారు. నిందితులు మహారాష్ట్ర గ్యాంగ్‌గా అనుమానిస్తున్న పోలీసులు.. వారిని పట్టుకునేందుకు కొన్ని బృందాలు మహారాష్ట్రకు వెళ్లాయి.
Gold Theft At Jewellery Shop : నిందితులు చోరీ తర్వాత ఆటోలో జేబీఎస్ వెళ్లిన ముఠా అక్కడి నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్లినట్టు సీసీ టీవీ ఫుటేజ్‌లో గుర్తించారు. పటాన్‌చెరు మీదుగా మహారాష్ట్ర వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఘటన జరిగిన చోట వందల జ్యూవెలరీ దుకాణాలు ఉండగా.. నాలుగో అంతస్తులోని మధుకర్ కార్ఖానాకు వెళ్లడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన జరిగిన సమయంలో మధుకర్ తన స్వస్థలం షోలాపూర్‌లో ఉన్నాడు. దర్యాప్తులో భాగంగా ఆయనను హైదరాబాద్‌కు పిలిపించి విచారిస్తున్నారు. గతంలో అక్కడ పని చేసిన వర్కర్ల వివరాలను సేకరిస్తున్నారు. పక్కా ప్రణాళికతోనే బంగారం చోరీ చేశారని పోలీసులు చెబుతున్నారు.
అసలేం జరిగిదంటే: మోండా మార్కెట్లో ఉన్న బంగారం దుకాణానికి ఐదుగురు వ్యక్తులు సూటు బూటు ధరించి వచ్చి ఆఫీసర్లలాగా కటింగ్ ఇస్తూ.. గోల్డ్ కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారంటూ షోపులోని సిబ్బందిని బెదిరించారు. షాపులో అటూ ఇటూ తిరుగుతూ హడివుడి చేస్తూ అక్కడ ఉన్న సిబ్బందిని పక్కకి వెళ్లగొట్టారు. అనంతరం షాపులో ఉన్న గోల్డ్‌ని పరిశీలిస్తూ.. సోదాలు చేస్తున్నట్లు నటిస్తూ.. చివరకు 1.7(1700 గ్రాముల) కిలోల బంగారానికి సంబంధించి ట్యాక్స్ కట్టలేదని.. అందుకే ఆ గోల్డ్‌ని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. నీటీసులు ఏమి ఇవ్వకుండానే అక్కడి నుంచి ఆ బంగారు బిస్కెట్లు తీసుకుని ఉడాయించారు. ఈ క్రమంలోనే సిబ్బందిని షాపులోనే ఉంచి తలుపులు వేసి వెళ్లారు. అయితే అందులో ఉన్న వ్యక్తి(వికాస్) ఇతర దుకాణాదురులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి ఆ తలుపులు తీశారు.
ఈ విషయం తెలుసుకున్న షాపు యజమాని ఆ ప్రాంతంలో ఉన్న మిగతా జ్యూవెలరీ షాపు యజమానులకు ఐటీ అధికారులు వచ్చి గోల్డ్ సీజ్ చేసిన సంగతి చెప్పాడు. అయితే వారు.. ఐటీ అధికారులు అలాగా వచ్చి తనిఖీలు చేయరని.. యజమానికి ముందుగా నోటీసులు ఇస్తారని చెప్పడంతో అతడికి అనుమానం వచ్చింది. వెంటనే మధుకర్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు చూసి ఆ ఐదుగురు వ్యక్తులు నకిలీ ఐటీ అధికారులుగా తేల్చారు. ఐటీ అధికారుల్లాగా నటించి దుకాణంలో గోల్డ్ కొట్టేశారని ధ్రువీకరించారు.
ఇవీ చదవండి: