సామాజిక మాధ్యమంలో వైకాపా ఎంపీ మార్గాని భరత్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన ఉండవల్లి అనూష అనే యువతికి పోలీసులు నోటీసులు పంపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల విషయంలో ఎంపీ మార్గాని భరత్‌ను సోషల్ మీడియా వేదికగా యువతి ప్రశ్నించింది. ఈ వీడియోలపై రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని బొమ్మూరు పోలీసుస్టేషన్లో స్థానిక వైకాపా నాయకులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనూషకు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. సైబర్ నేరం 41(a) సెక్షన్ కింద యువతికి నోటీసులు అందించారు.
ఇదీ చదవండి: రైతును రాజుగా చూడటమే కేసీఆర్ లక్ష్యం: ఎర్రబెల్లి