ETV Bharat / state

డబ్బులిస్తే చాలు ఏ సర్టిఫికెట్ అయినా రెడీ చేస్తారు.. - Fake Certificates Gang Arrest

Fake Certificates Gang Arrest: నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ తయారు చేసి అమ్ముతున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటి బృందంతో కలిసి చైతన్య పురి పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మిర్యాల ఆనంద్​తో పాటు మల్లేపాక హేమంత్, షేక్ షాహిన్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు కళ్యాణ్ పరారీలో ఉన్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు.

నకిలీ ధృవపత్రాలు
నకిలీ ధృవపత్రాలు
author img

By

Published : Nov 23, 2022, 7:33 PM IST

Fake Certificates Gang Arrest: నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ తయారు చేసి అమ్ముతున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ బృందంతో కలిసి చైతన్య పురి పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మిర్యాల ఆనంద్​తో పాటు మల్లేపాక హేమంత్, షేక్ షాహిన్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు కళ్యాణ్ పరారీలో ఉన్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు.

ప్రధాన నిందితడు ఆనంద్ కుమార్ చైతన్య పురిలో ఫ్లెక్సీ డిజైనింగ్ వర్క్​ చేస్తుంటాడు. డబ్బులు సరిపోక మరో ముగ్గురితో కలిసి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి అమ్ముతున్నట్లు సీపీ తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యి.. చదువు మధ్యలో అపేసి ఇతర దేశాలకి వెళ్లాలనుకున్న విద్యార్థులను టార్గెట్ చేసి ఈ నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్నట్టు వెల్లడించారు. వీసా కోసం, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం నిరీక్షంచే వ్యక్తుల నుంచి ఒక్కో సర్టిఫికెట్​కు 50 నుంచి 60వేలు రూపాయలు తీసుకుంటున్నారని సీపీ మహేష్‌ భగవత్ వివరించారు.

తమకందిన సమాచారంతో నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి ఎస్​ఎస్​సీ ఇంటర్మీడియట్, డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్​టీయూ, కాకతీయ, ఆంధ్ర, ఆచార్య, గీతం, వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లు కంప్యూటర్స్, నకిలీ లోన్ సాంక్షన్ లెటర్స్, నకిలీ కోవిడ్ సర్టిఫికెట్స్ స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.