ETV Bharat / state

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కరోనా కష్టాలు - ఈటీవీ భారత్​ వార్తలు

పోలవరం ప్రాజెక్టుకూ కరోనా కష్టాలు తప్పడంలేదు. స్పిల్‌వే గేట్ల ఏర్పాటులో కీలకమైన హైడ్రాలిక్‌ సిలిండర్లు జర్మనీ నుంచి రావాల్సి ఉండగా... వీటి రవాణాలో తలెత్తుతున్న సమస్యలతో జాప్యం పెరుగుతోంది. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేయడం అనుమానంగానే కనిపిస్తోంది

కరోనాతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం!

author img

By

Published : Nov 20, 2020, 9:56 AM IST

కరోనా వల్ల తలెత్తిన అనేక సమస్యల ప్రభావం పోలవరం ప్రాజెక్టుపై పడింది. రవాణాలో ఏర్పడిన అనేక సమస్యల వల్ల నిర్మాణంలో జాప్యం పెరుగుతోంది. పోలవరం గేట్ల ఏర్పాటులో కీలకమైన హైడ్రాలిక్‌ సిలిండర్లు మరో 42 జర్మనీ నుంచి రావాల్సి ఉంది. గేట్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తికి ఇవి ముఖ్యం. వీటి కోసం గతంలోనే గుత్తేదారులు జర్మనీలో తయారీదారులను పురమాయించారు. కరోనా వల్ల అంతర్జాతీయంగా కొంతకాలం పాటు రవాణా ఆగిపోవడంతో సమస్యలేర్పడ్డాయి.

ప్రస్తుతం 56 సిలిండర్లు పోలవరం వద్ద అందుబాటులో ఉన్నాయి. వీటితో 28 గేట్ల పనులను పూర్తిచేసే అవకాశముంది. సాధారణంగానైతే.. పోలవరం ఇంజినీర్ల బృందం జర్మనీకి వెళ్లి సిలిండర్ల పనితీరు గమనించి ఆమోదించాక తయారీని వేగవంతం చేస్తారు. కరోనా వల్ల ఇంజినీర్ల జర్మనీ పర్యటన వాయిదా పడింది. ఇక్కడే పరీక్షించుకుంటామని... ప్రాజెక్టు అధికారులు జర్మనీ సంస్థతో ఒప్పందంలోనూ మార్పులు చేసుకున్నారు.

మరోవైపు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని పోలవరం అథారిటీ పట్టుబడుతోంది. వచ్చే వాన కాలం నాటికి కాఫర్‌డ్యాం నిర్మించాల్సి ఉంది. స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానల్‌ పనులను పూర్తి చేయాలి. వీటితో పాటే స్పిల్‌వేలో గేట్ల ఏర్పాటు ప్రక్రియ కొలిక్కి రావాల్సి ఉంది. ఈ పనుల పూర్తికి 7 నెలల గడువే ఉంది. ఈలోగా జర్మనీ నుంచి సిలిండర్లను రప్పించాల్సి ఉంది. ఎక్కువ బృందాలను ఏర్పాటు చేసుకుంటే నిర్దిష్ట సమయంలో గేట్ల ఏర్పాటు ప్రక్రియ సవాలును కొంతవరకు అధిగమించవచ్చని అధికారులు చెబుతున్నారు.

సిలిండర్ల రవాణా అన్ని ఓడల్లోనూ సాధ్యం కాదని ఇంజినీర్లు చెబుతున్నారు. ఒక్కో సిలిండర్‌ 17 మీటర్ల పొడవుంటుంది. విశాలమైన బహిరంగ స్థలమున్న నౌకలనే వాడాల్సి ఉంటుంది. జర్మనీ నుంచి భారత్‌కు వచ్చే రవాణా నౌకలన్నీ.. నేరుగా చైనాకు, తర్వాత ముంబయికి చేరుతున్నాయని అధికారులు చెబుతున్నారు. దీని వల్ల రవాణాలో ఏర్పడుతున్న జాప్యాన్ని నివారించాలని ఇటీవలి సమీక్షలో ఉన్నతస్థాయి ఆదేశాలు అందినట్లు సమాచారం. ప్రతి నెలా రెండు నౌకలే జర్మనీ నుంచి వస్తుంటాయని చెబుతున్నారు. నేరుగా తీసుకురావడం వల్ల రవాణా వ్యయం పెరుగుతుందని ఇంజినీర్లు పేర్కొంటున్నారు.

కరోనాతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం!

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 894 కరోనా కేసులు.. నలుగురు మృతి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.