ETV Bharat / state

KTR FRANCE TOUR: కేటీఆర్​ చొరవ... హైదరాబాద్​లో ప్లగ్ అండ్ ప్లే టెక్ సెంటర్ - Ktr latest updates

ఆవిష్కరణలకు సంబంధించి ప్రపంచస్థాయి నెట్​వర్క్ అయిన ప్లగ్ అండ్ ప్లే టెక్ సెంటర్ హైదరాబాద్​లో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. భారతదేశంలో మొదటి కేంద్రాన్ని హైదరాబాద్ వేదికగా డిసెంబర్​లో ప్రారంభించనున్నట్లు పారిస్​లో మంత్రి కేటీఆర్​తో సమావేశం సందర్భంగా నెట్​వర్క్ ప్రతినిధులు ప్రకటించారు. ఆవిష్కరణలకు ఇప్పటికే ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణలో ఇన్నోవేషన్ ఎకోసిస్టింకు మరింత ఊతమిస్తుందని కేటీఆర్ అన్నారు. సుస్థిర పట్టణాల రూపకల్పనలో భాగస్వామ్యం కోసం చారిత్రక లగ్జెంబర్గ్ ప్యాలెస్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం బోర్డెక్స్ మెట్రోపొలిస్​తో ఒప్పందం కుదుర్చుకొంది.

KTR
కేటీఆర్
author img

By

Published : Oct 30, 2021, 8:04 PM IST

యాంబిషన్ ఇండియా సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్ వెళ్లిన పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధుల బృందం పలు కంపెనీలు, సంస్థల సీఈఓలు, అధిపతులతో సమావేశమైంది. ఆవిష్కరణలకు సంబంధించిన ప్రముఖ నెట్​వర్క్ ప్లగ్ అండ్ ప్లే ఎండీలు ఒమీద్ మెహ్రిన్ ఫార్, శాషా కారింపౌర్, ఇతర ప్రతినిధులతో కేటీఆర్ బృందం భేటీ అయింది. 35 వేలకు పైగా అంకురాలు, 530కి పైగా ప్రపంచస్థాయి కార్పొరేషన్లతో ఉన్న ప్రపంచంలోనే పెద్దదైన ప్లగ్ అండ్ ప్లే నెట్ వర్క్... ఇప్పటికే తొమ్మిది బిలియన్ డాలర్ల వెంచర్ ఫండింగ్ చేసింది. ప్లగ్ అండ్ ప్లే టెక్ సెంటర్ నెట్ వర్క్ సిలికాన్ వ్యాలీ సహా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 37 దేశాల్లో కార్యాలయాలు కలిగి ఉంది. మంత్రి కేటీఆర్​తో భేటీ సందర్భంగా భారతదేశంలో తమ తొలి కేంద్రాన్ని హైదరాబాద్​లో ఏర్పాటు చేయనున్నట్లు ప్లగ్ అండ్ ప్లే ప్రతినిధులు ప్రకటించారు.

కేటీఆర్​ చొరవ చూసి...

మంత్రి కేటీఆర్ చొరవ, మద్దతును చూసి హైదరాబాద్​లో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపిన ప్రతినిధులు... రవాణా, ఐఓటీ, ఇంధనం, మౌలిక వసతులకు సంబంధించిన ఎకోసిస్టంపై దృష్టి సారించనునట్లు తెలిపారు. భవిష్యత్​లో ఫిన్ టెక్, వైద్యారోగ్య రంగాలకు కూడా విస్తరిస్తామని చెప్పారు. భారతదేశానికి చెందిన ప్రముఖ కంపెనీలు, సంస్థలతో కలిసి ఆవిష్కరణలను మరింతగా మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇండియన్ స్టార్టప్​లు పెద్దపెద్ద సంస్థలతో కలిసి పనిచేసేలా ప్లగ్ అండ్ ప్లే నెట్ వర్క్ సెంటర్ గేట్ వేగా పనిచేయనుందని... పెట్టుబడులు పెట్టడంతో పాటు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుందని వివరించారు.

ప్లగ్ అండ్ ప్లే నెట్​వర్క్​కు స్వాగతం...

భారతదేశంలో అంకురాల కోసం ఉన్న అతిపెద్ద ఇంక్యుబేటర్ టీహబ్ ఉన్న తెలంగాణలో ప్లగ్ అండ్ ప్లే నెట్ వర్క్ సెంటర్ ఏర్పాటు నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఇది ఇన్నోవేషన్ ఎకోసిస్టింకు మరింత ఊతమిస్తుందన్నారు. హైదరాబాద్ ద్వారా భారతదేశంలోకి రావాలని నెట్​వర్క్ నిర్ణయించడం సంతోషకరమన్న ఆయన... హెల్త్ కేర్, ఐఓటీ, ఇంధనం, ఫిన్ టెక్ రంగాలపై మరింతగా దృష్టి సారిస్తోందన్నారు. ప్లగ్ అండ్ ప్లే తో సహకారంతో మరింత క్రియాశీలకంగా ముందుకెళ్లే అవకాశం ఏర్పడుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మంత్రి కేటీఆర్, నెట్​వర్క్ వ్యవస్థాపకులు సయీద్ హమిదీ సమక్షంలో డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని ప్లగ్ అండ్ ప్లే ప్రతినిధులు ప్రకటించారు. సఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి కేటీఆర్... తెలంగాణలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఫ్రాన్స్​కు చెందిన బోర్డెక్స్ మెట్రోపొలిస్​తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది.

కేటీఆర్ సమక్షంలో ఒప్పందం...

సుస్థిర పట్టణాల రూపకల్పనలో బోర్డెక్స్ మెట్రోపొలిస్​తో భాగస్వామ్యం కోసం పారిస్​లోని చారిత్రక లక్జెంబర్గ్ ప్యాలెస్​లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం జరిగింది. 2015లో చేరుకున్న సహకార ఒప్పందానికి కొనసాగింపుగా తాజా ఒప్పందాన్ని చేసుకున్నారు. ఫ్రాన్స్​కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ సర్వియర్ ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్ బృందం... తెలంగాణలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల గురించి వివరించింది. 2022లో జరగనున్న బయోఏసియా సదస్సులో పాల్గొనాలని సర్వియర్ ప్రతినిధులను కేటీఆర్ ఆహ్వానించారు. హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణలో భాగస్వామ్య సంస్థ అయిన కియోలిస్ గ్రూప్ ప్రతినిధులతోనూ కేటీఆర్ సమావేశమయ్యారు. ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆసియా డైరెక్టర్ పిలిఫ్​తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. డిజిటల్ టెక్నాలజీ సంస్థ థేల్స్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్... మెడిసిన్ ఫ్రం ది స్కై సహా ఎమర్జింగ్ టెక్నాలజీస్​ను తెలంగాణ వినియోగిస్తున్న తీరును వివరించారు.

సంబంధిత కథనాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.