యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూసిన చంద్రయాన్-2 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. చిట్ట చివరి దశలో విక్రమ్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. చివరి 15 నిమిషాలు ఎంతో ఉత్కంఠను రేపాయి. ప్రధాన మంత్రి కూడా ప్రయోగం విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు. అయితే ఇప్పడు సంకేతాలు మాత్రమే ఆగిపోయాయని... ల్యాండర్ తన కృత్రిమ మేధస్సుతో లక్ష్యాన్ని చేరుకుంటుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి కొంత సమయం పడుతుందని అన్నారు. ఇది ఒక పాఠం మాత్రమేనని... భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేపట్టాల్సి ఉందని ప్లానెటరీ సొసైటీ ఫౌండర్ అండ్ డైరక్టర్ రఘునందన్ అన్నారు. ఇప్పుడు చంద్రయాన్-3 ప్రాజెక్టును ప్రకటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శాస్త్రవేత్తలు తప్పకుండా జాబిల్లిపై విజయం సాధిస్తారన్న రఘునందన్కుమార్తో ఈటీవీభారత్ ముఖాముఖి...
ఇదీ చూడండి : చంద్రయాన్-2: ఒక లక్ష్యం- వెయ్యి మెదళ్లు