ETV Bharat / state

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై ప్రజల హర్షాతిరేకాలు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్​కౌంటర్​ చేసినందుకు నగరంలో పలు చోట్ల ప్రజలు సంబురాలు చేసుకున్నారు.  బాణాసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుతూ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​, సీపీ సజ్జనార్​ గొప్ప నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.

people happy about disha accused encounter
దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై ప్రజల హర్షాతిరేకాలు
author img

By

Published : Dec 6, 2019, 11:21 PM IST

దిశ హంతకులను ఎన్​కౌంటర్ చేసినందుకు దేశవ్యాప్తంగా ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నారు. నగరంలో పలుచోట్ల మిఠాయిలు పంచుతూ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర శివారు మణికొండలో కృషి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు. ఇలాంటి నేరాలు మళ్లీ మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కృషి ఫౌండేషన్ ఛైర్మన్ పట్లోళ్ల రూపాదేవి అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్​, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలియజేశారు.

బషీర్​బాగ్​ కూడలిలో...

బషీర్​బాగ్ కూడలిలో స్థానిక తెరాస నాయకులు సంతోష్ గుప్తాతో పాటు పలువురు నాయకులు మిఠాయిలు పంచుతూ సంబురాలు చేసుకున్నారు. కాలేజ్ యువతులకు మిఠాయిలు ఇస్తూ ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ విషయంలో గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్​కు, సీపీ సజ్జనార్​కు కృతజ్ఞతలు తెలిపారు.

లారీ డ్రైవర్లపై మచ్చ తొలగిపోయింది...

వనస్థలిపురంలోని ఆటోనగర్​లో లారీల యజమానులు, డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ స్టేట్ లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నందా రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు. నిందితులు లారీ డ్రైవర్లు కావడం వలన తమకు మచ్చ ఏర్పడిందని, ఈ ఎన్​కౌంటర్​తో ఆ మచ్చ తొలగిపోయిందని‌ తెలిపారు.

సీపీ సజ్జనార్​ చిత్రపటానికి పాలాభిషేకం

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇస్నాపూర్ కూడలిలో భాజపా రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో సీపీ సజ్జనార్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై ప్రజల హర్షాతిరేకాలు

ఇవీ చూడండి: 'సీపీ సజ్జనార్ సార్ ఉంటే... మాకూ న్యాయం జరిగేది'

TG_Hyd_57_06_Disha Sambaraalu At Basheerbag_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) దిశ నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడం పై హైదరాబాద్ నగర వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. పోలీసులు నిజమైన న్యాయం చేసారని... దిశ ఆత్మకు శాంతి చేకూరాలని వారు అన్నారు. బషీర్బాగ్ కూడలిలో లో స్థానిక తెరాస నాయకులు సంతోష్ గుప్తా తో పాటు పలువురు నాయకులు మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. కాలేజ్ యువతులకు మిఠాయిలు ఇస్తూ దైర్యంగా ఉండాలని సూచించారు. ఈ విషయంలో గొప్ప నిర్ణయం తీసుకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోలీసు కమిషనర్ సజ్జనార్ కు కృతజ్ఞతలు తెలిపారు. బైట్: సంతోష్ గుప్తా, తెరాస నాయకుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.