ETV Bharat / state

సృజనాత్మకతకు.. సామాజిక బాధ్యత జత చేయాలి : పవన్​ కల్యాణ్​ - యువతపై జనసేనాని తాజా వాఖ్యలు

లాక్​డౌన్ సమయంలోనూ రైతులు, కార్మికులు, ప్రజలు ఎన్నో ఇబ్బందులకు లోనయ్యారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నూతన ఆవిష్కరణలకు సామాజిక బాధ్యతను జోడించి చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్న యువతను ఆయన అభినందించారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖలు చేయాలని.. యువత స్పందించడమే కాకుండా ఒక పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.

pawan kalyan comments youth in ap
సృజనాత్మకతకు.. సామాజిక బాధ్యత జత చేయాలి : పవన్​ కల్యాణ్​
author img

By

Published : Oct 24, 2020, 7:26 PM IST

నూతన ఆవిష్కరణకు సామాజిక బాధ్యతను జోడించి చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్న మిత్రత్రయం దినేష్, రామ్ కల్యాణ్, పి.వి.అభిషేక్‌లను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అభినందించారు. చేనేత ఎంతో సృజనాత్మక కళ అని.. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నవారికి కష్టాలు, కన్నీళ్లు పడుగుపేకల్లా అల్లుకొని ఉంటాయన్నారు. ఎమ్మిగనూరు, మదనపల్లె, మంగళగిరిల్లో చేనేత కార్మికులను కలిసినప్పుడు వారు తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదనే ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు.

లాక్​డౌన్ సమయంలోనూ రైతులు, చేనేత కార్మికులు, ప్రజలు, అన్ని రంగాల వారు ఎన్నో ఇబ్బందులకు లోనయ్యారని పవన్ అన్నారు. ఎన్ఐటీలో చదువుకున్న దినేష్, రామ్ కల్యాణ్, అభిషేక్​లు కలిసి ఒక యాప్ రూపొందించి చేనేత కార్మికులకు కష్టానికి తగ్గ ఫలం దక్కేలా చేయడం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఆ కార్మికుల కష్టాన్ని కళ్లారా చూసి స్పందించారు కాబట్టే.. చక్కటి ఈ-ప్లాట్​ఫార్మ్​ సిద్దమైందని.. నిజమైన నేతన్నలను, కొనుగోలుదారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చారని తెలిపారు. కష్టపడ్డవారికి తగిన ప్రతిఫలం వెళ్లే మార్గం ఏర్పడిందని కొనియాడారు. వాస్తవానికి ఇలాంటి ప్రయత్నాలను రాష్ట్ర చేనేత, జౌళి శాఖలు చేయాలని.. యువత స్పందించడమే కాకుండా ఒక పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని పవన్‌ అన్నారు.

ఇదీ చూడండి: తిరుమలలో శ్రీవారికి వైభవంగా చక్రస్నానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.