ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లె టమాటా మార్కెట్ సందర్శన అనుమతి ఇవ్వకపోయినా భయపడే ప్రసక్తే లేదని జనసేన అధ్యక్షుడు పవన్ స్పష్టం చేశారు. అంబేడ్కర్ తాలూకు భావజాలంతో పోరాడతామన్నారు. 'మేము గొర్రెలం కాదు సింహాలం.. సింహాలు గడ్డాలు గీసుకోవ్.. మేము కూడా గీసుకోం' అని పవన్ చిరునవ్వులు చిందించారు. మార్పుకోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న ఆయన... జనసైనికులందరూ ధైర్యంగా పోరాడాలన్నారు. భయకుండా ఫ్యాక్షన్ రాజకీయాలను ఎదుర్కోవాలన్నారు. స్వతంత్ర నాయకుల భావజాలంతో పోరాడితే... 151 ఎమ్మెల్యేలు ఉన్న వైకాపా ఎంత.. చిటికెనంత అని ఎద్దేవా చేశారు.