ETV Bharat / state

తెలంగాణ భవన్ సాక్షిగా పట్నం వర్సెస్ పైలట్ - తాండూరు బీఆర్​ఎస్​లో మరోసారి భగ్గుమన్న విభేదాలు - Mahender vs Rohith

Patnam Mahender Reddy vs Pilot Rohith Reddy : తాండూరు బీఆర్ఎస్‌లో విభేదాలు మరోమారు భగ్గుమన్నాయి. పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. కొద్దిపాటి సమయమే అయినప్పటికీ, ఇరువురు నాయకులతో పాటు వారి అనుచరుల వాగ్వాదం, పరస్పర నినాదాలతో వాతావరణం వేడెక్కింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో సమావేశమైన నేతలు వారికి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

Clash Between Patnam and Pilot
Clash Between Patnam and Pilot
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2024, 10:52 AM IST

తెలంగాణ భవన్ సాక్షిగా పట్నం వర్సెస్ పైలెట్

Patnam Mahender Reddy vs Pilot Rohith Reddy : భారత్‌ రాష్ట్ర సమితి పార్టీ సన్నాహక సమావేశాలు తాండూరు వర్గపోరుకు వేదికయ్యాయి. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి (MLC Patnam Mahender Reddy), మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి వర్గాలు బాహాబాహీకి దిగాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొంది, ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో రోహిత్‌రెడ్డి చేరినప్పటి నుంచి ఇద్దరి మధ్య మనస్పర్థలు కొనసాగుతున్నాయి. తాండూరు టికెట్ విషయంలోనూ ఇరువురూ పరస్పరం సవాళ్లు-ప్రతిసవాళ్లతో రాజకీయాన్ని వేడెక్కించారు.

Clash Between Patnam and Pilot : ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మహేందర్‌రెడ్డికి (Patnam Mahender Reddy) మంత్రి పదవి ఇవ్వడం, ఇద్దరి మధ్య సఖ్యతకు దారితీసింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తాండూరులో బీఆర్ఎస్‌ అభ్యర్థి రోహిత్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. మహేందర్‌రెడ్డి వర్గం వ్యతిరేకంగా పనిచేసినందునే, తాము ఓటమి పాలయ్యామనే భావన రోహిత్‌రెడ్డి వర్గీయుల్లో నెలకొంది.

"ఇక నా దృష్టంతా నియోజక వర్గ అభివృద్ధిపైనే"

ఓటమికి కారకులు ఏమని మాట్లాడతారని నినాదాలు : సమావేశంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ప్రసంగించేందుకు సిద్ధమైన తరుణంలో, రోహిత్‌రెడ్డి వర్గీయులు అభ్యంతరం చెప్పడం గొడవకు దారి తీసింది. ఓటమికి కారకులు ఏమని మాట్లాడతారని నినాదాలు చేశారు. దీనిపై మహేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాలు పరస్పరం నినాదాలతో హోరెత్తించాయి. వేదికపైనే ఉన్న రోహిత్‌రెడ్డి సైతం తీవ్రంగా స్పందించారు.

ఇరువురికి సర్దిచెప్పిన సీనియర్ నేతలు : మహేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి (Pilot Rohith Reddy) పరస్పరం దూషించుకున్నట్లు నేతలు చెబుతున్నారు. ఓ దశలో పరస్పరం దాడి జరిగే పరిస్థితులు ఏర్పడ్డా, నేతలు సీనియర్‌ నాయకులు వారిని సముదాయించారు. అప్రమత్తమైన హరీశ్‌రావు సహా ఇతర నేతలు ఇరువురితో పాటు కార్యకర్తలకు నచ్చజెప్పి వెంటనే భోజన విరామం ప్రకటించారు. విరామ సమయంలో మహేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలతో సీనియర్ నేతలు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి సమావేశమై వారికి సర్దిచెప్పారు.

"చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించిన నేతలందరం సమావేేశమయ్యాం. రంజిత్‌రెడ్డిని తప్పకుండా గెలిపిస్తాం. చిన్నచిన్న విబేధాలు ఉంటాయి. ఏదో ఎన్నికల్లో ఓడిపోయామని వారు చెబుతారు. ఎలాంటి గొడవలు జరగలేదు. అన్నదమ్ములవల్లే సర్దుకొని అందరిని కలుపుకొని పనిచేస్తాం." - పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ

తాండూరులో వర్గపోరు.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల తోపులాట..

ముందు వరుసల్లో ఉండి ఫొటోలకు ఫోజులు ఇచ్చే వాళ్లు, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. ఆరుగంటల సుదీర్ఘ సమావేశంలో కొంత సేపు చిన్నపాటి వాగ్వాదం సహజమని సీనియర్ నేత మధుసూధనాచారి తెలిపారు. సమావేశం అనంతరం రోహిత్‌రెడ్డితో పాటు ఆయన వర్గీయులు హరీశ్‌రావుతో (Harish Rao) విడిగా సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల వేళ జరిగిన పరిణామాలను వారు ఆయనకు వివరించారు.

తాండూర్‌లో ఆడియో హీట్‌... ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్యలో సీఐ

పొరపాటున నోరుజారి మనసు నొప్పించినందుకు విచారిస్తున్నా: మహేందర్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.