బంజారాహిల్స్‌లోని స్పర్శ్ హాస్పైస్‌లో పాలియేటివ్ కేర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. క్యాన్సర్ రోగుల కోసం ఇటీవల ప్రభుత్వం 12 పాలియేటివ్ కేర్ సెంటర్లను ప్రారంభించిందని మంత్రి పేర్కొన్నారు. క్యాన్సర్ అత్యంత బాధాకరమైన పరిస్థితి అని, రోగులతో పాటు కుటుంబ సభ్యులను కూడా ఇది కుంగదీస్తుందన్నారు. అయితే తొలిదశలో క్యాన్సర్‌ని గుర్తిస్తే నివారించటం సులభమన్న ఈటల ఈ మేరకు కేంద్రంకు సరికొత్త చర్యలు చేపట్టాలని సూచించామన్నారు.
ఇదీ చూడండి : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కంటికి స్వల్ప గాయం