Hyderabad Osmania Hospital Online OP Registration : ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలంటే చాలు.. గంటల తరబడి ఓపీ కోసం వేచి చూడాలి. అది తీసుకున్నాక డాక్టర్ వద్దకు వెళ్లాలి. అక్కడ నుంచి మరో డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే మరల ఓపీ తీసుకోవాలి. ఒక నెల లేదా రెండు నెలల తర్వాత ఆసుపత్రికి వెళ్లిన మళ్లీ ఓపీ కోసం నిలబడాలి. ఇలా ఓపీ కోసమే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ప్రభుత్వాసుపత్రుల్లో మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఆ పరిస్థితికి చెక్ పడింది.
ప్రభుత్వం నూతనంగా ఆన్లైన్ ఓపీలంటూ డిజిటల్ ఓపీలను(Online OP Registration) అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతానికి ఉస్మానియా ఆసుపత్రి(Osmania General Hospital Hyderabad)లో ఈ నూతన పద్ధతిని అమలు చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే పేషంట్స్ ఆధార్ నంబర్‌ను తీసుకొని వాటిని ఆన్లైన్ చేస్తూ.. 'ఈ సుస్రుత్'(e-Sushrut) పోర్టల్‌లో ఆధార్ ఎంటర్ చేసి వారి థంబ్ తీసుకుంటున్నారు. ఫలింతంగా భవిష్యత్‌లో ఓపీ కోసం వేచి చూడాల్సిన పని ఉండదని అధికారులు చెబుతున్నారు.
Online OP Registration in Osmania General Hospital Hyderabad : డిజిటలైజ్ ప్రకారం స్టాటిస్టిక్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని ఉస్మానియా సూపరిడెంట్ డాక్టర్ నాగేంద్ర అన్నారు. నేషనల్ పోర్టల్‌లో కూడా ఎంతమందికి సర్వీస్ చేస్తున్నాం.. ఎటువంటి సర్వీస్ అందిస్తున్నామనేది తెలియడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. పేషంట్స్‌కి సీఆర్ నంబర్ జనరేట్ అయితే వారి వివరాల గురించి తెలుస్తుందని చెప్పారు. పేషంట్ ఇండియాలో ఏ ఆసుపత్రికి వెళ్లిన వారి ఆరోగ్య వివరాలు తెలుస్తుందన్న ఆయన.. దీని వలన పేషంట్‌కి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు.
E-Sushrut Online OP Registration : పేషంట్ పేరు, వయసు, సెక్స్, ఆధార్ నంబర్‌తో ఆన్లైన్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. దాదాపు నెల రోజుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. రోజుకి 2,400 నుంచి 2,300 వరకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఆరు మోడ్యూల్స్‌తో దీనిని మొదులుపెట్టామని చెప్పారు. ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ రిజిస్ట్రేషన్, అలాగే ఓపీ చిట్స్ని కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. ప్రిస్క్రిప్షన్(Prescription) కూడా అప్లోడ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఓపీ స్లిప్‌ల కంటే.. అన్లైన్ ఓపీ ఎక్కవ సమయం పడుతుంది : ఓపీ రిజిస్ట్రేషన్(OP Registration) ఇప్పుడు పూర్తిగా 100 శాతం చేస్తున్నామని అన్నారు. ఓపీ స్లిప్‌ల కంటే ఈ ప్రొసెస్ కొంచెం ఎక్కువ సమయం పడుతుందన్న ఆయన.. దీని కోసం ప్రస్తుతానికి ఏడు కౌంటర్లు పెట్టామని.. పేషంట్స్ని బట్టి వాటిని కూడా పెంచే మార్గం చేస్తామన్నారు. రెగ్యులర్‌గా ఈ అన్లైన్ ఓపీ అమలు చేస్తున్నట్లు వివరించారు. కొంత కాలంలో ఒక్క ఓపీతో మల్టీ స్పెషాలిటీగా కూడా చూపించుకోవచ్చని తెలిపారు. దీనికి సంబంధించి సాఫ్ట్వేర్ పనులు చేస్తున్నట్లు చెప్పారు.
అలాగే ఓపీ రిజిస్ట్రేషన్‌లో అప్లోడ్ చేయడానికి మెబైల్ కొనివ్వడం జరిగిందన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా పేషంట్స్‌కి ఎలాంటి వైద్యం అవసరమో తెలుస్తుందని వివరించారు. తద్వారా పేషంట్స్‌కి మెరుగైన వైద్యం అందించడానికి అస్కారం ఉంటుందన్నారు. ఈ ఆన్లైన్ వలన పేషంట్స్‌కి తిరిగే పని కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. దీంతో వైద్యుడికి కూడా వన్ క్లీక్తో ఎలాంటి డ్రగ్ పేషంట్‌కి ఇవ్వాలనేది ఈజీగా తెలుస్తోందన్నారు. ఈ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అటు వైద్యులకు, ఇటు పేషంట్లకు సులువు అవుతుందని వివరించారు.
NIMS Expansion : హైదరాబాద్ సిగలో మరో మణిహారం.. దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి భవంతి
Seasonal Diseases in Telangana : వాతావరణంలో మార్పులు.. జ్వరాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్న రోగులు