ETV Bharat / state

ప్రస్తుతం ఆ దేశాలకు మాత్రమే విమాన ప్రయాణం - తెలంగాణ తాజా వార్తలు

కొవిడ్‌ దృష్ట్యా దేశంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఆంక్షలు అమలవుతున్నాయి. రెగ్యులర్‌ అంతర్జాతీయ విమానాల రాకపోకలు పూర్తిగా రద్దయ్యాయి. దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 28 దేశాల నుంచి మాత్రమే 'ఎయిర్‌ ట్రాన్స్‌పోర్టు బబుల్స్‌' పేరున భారత్‌ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు సాగిస్తున్నాయి.

Air Transport Bubbles
Air Transport Bubbles
author img

By

Published : Apr 19, 2021, 10:15 PM IST

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కొవిడ్‌ ఉద్ధృతితో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై భారత్‌ ఆంక్షలు విధించింది. వివిధ దేశాల నుంచి అవసరాలకు అనుగుణంగా నడిచే 'వందే భారత్‌ మిషన్‌' విమానాల రాకపోకలకు ఈ నిబంధనలు వర్తించవు. ఐతే పరిమిత సంఖ్యలో ఎంపిక చేసుకున్న దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు "ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ బబుల్స్‌'' పేరున అంతర్జాతీయ విమానాల రాకపోకలు సాగుతున్నాయి. అందులో భాగంగా 28 దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. అఫ్ఘనిస్థాన్‌, బహ్రెయిన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, కెనడా, ఇథియోపియా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇరాక్‌, జపాన్‌, కెన్యా, కువైట్‌, మాల్దీవులు, నేపాల్‌, నెదర్‌ల్యాండ్స్‌, నైజీరియా, ఒమెన్‌, ఖతార్‌, రష్యా, రువాండా, షీషెల్స్‌, టాంజానియా, ఉక్రెయిన్‌, యూఏఈ, యూకే, యూఎస్​ఏ, ఉజ్బెకిస్థాన్‌, శ్రీలంకతో విమాన రాకపోకలపై ఒప్పందం కుదుర్చుకుంది.

శంషాబాద్​ నుంచి...

కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ... ఆయా దేశాల నుంచి నేరుగా మనదేశానికి "ఎయిర్‌ ట్రాన్స్‌పోర్టు బబుల్స్‌'' పేరున విమానాలు నడుస్తున్నాయి. 72 గంటల ముందు కొవిడ్‌ పరీక్షలు చేసుకున్నవారిని మాత్రమే అనుమతిస్తారు. ఆయా దేశాల్లో బయలు దేరే విమానాలు మధ్యలో ఆగకుండా నేరుగా భారత్‌కు వస్తాయి. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి 8 దేశాలకు విమానాలు తిరుగుతున్నాయి. ఒమెన్‌, బహ్రెయిన్‌, కువైట్‌, మాల్దీవులు, ఖతార్, యూఏఈ, యూకే, యూఎస్​ఏకు నేరుగా విమానాలు రాకపోకలు సాగిస్తున్నట్లు శంషాబాద్‌ విమానాశ్రయ అధికారులు తెలిపారు. బయట దేశాల నుంచి వచ్చిన వారికైనా... ఇక్కడి నుంచి బయట దేశాలకు వెళ్లాలన్నా కొవిడ్‌ పరీక్షలు తప్పనిసరి. నెగిటివ్‌ వచ్చినట్లు రిపోర్టు ఉంటేనే విమాన ప్రయాణానికి అనుమతిస్తారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలోని అన్నికోర్టుల్లో ప్రత్యక్ష విచారణ నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.