One Week One Lab Program at NGRI Hyderabad : జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ).. భూప్రక్రియల నమూనాకరణ.. విద్యుత్ భూ భౌతిక శాస్త్రం.. విద్యుదయస్కాంత భూ భౌతిక శాస్త్రం.. భూ రసాయన శాస్త్రం, భూ కాలక్రమ శాస్త్రం, భూగర్బ శాస్త్రం, భూ గణితం, గురుత్వాకర్షణ, అయస్కాంత ప్రభావాధ్యయన శాస్త్రం, ఉష్ణ భూభౌతిక శాస్త్రం, పురా అయస్కాంతత్వం, శిలా యాంత్రిక శాస్త్రం, యంత్రీకరణ, భూకంప అధ్యయన శాస్త్రం(Seismology), భూకంప శాస్త్రాల గురించి పరిశోధనలు చేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ సంస్థ ఎలా ఉంటుంది ? అది ఎలా పని చేస్తుంది.. అందులో పరిశోధనలు ఎలా చేస్తారు..? ఇలా ఎన్‌జీఆర్‌ఐ గురించి అక్కడ పనిచేసే శాస్త్రవేత్తలు, సిబ్బందికి మాత్రమే తెలుసు.
NGRI Special Program For Students 2023 : మొట్టమొదటి సారిగా ఎన్‌జీఆర్‌ఐ గురించి సామాన్యులు, విద్యార్థులు కూడా తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది ఈ సంస్థ. ఇందుకోసం హైదరాబాద్లోని హబ్సిగూలో ఈ పరిశోధనా కేంద్రాన్ని ఇవాళ్టి నుంచి (సెప్టెంబర్ 4) నుంచి 9వ తేదీ వరకు సందర్శించే అవకాశం కల్పించింది. 'ఒక వారం- ఒక ప్రయోగశాల' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి.. సామాన్య ప్రజలకు ఎన్జీఆర్ఐని సందర్శించే అవకాశం కల్పిస్తోంది. ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమంతో ప్రజలు, విద్యార్థులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఈ నెల 8వ తేదీన సామాన్య ప్రజలు, విద్యార్థులు సందర్శించే అవకాశం ఇస్తూ వారికి.. ఆహ్వానం పలుకుతోంది.
- — CSIR-NGRI Offl. A/c (@csirngri) September 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
— CSIR-NGRI Offl. A/c (@csirngri) September 3, 2023
">— CSIR-NGRI Offl. A/c (@csirngri) September 3, 2023
హైదరాబాద్‌లో భూకంపాల తీవ్రత అత్యల్పం: ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్త
ఈ వారం రోజులు ఎన్‌జీఆర్‌ఐ నిర్వహించే కార్యక్రమాలు
- మొదటి రోజు - ప్రారంభోత్సవం, ఎంఓఈ వేడుక, ఆర్ అండ్ డీ ఎగ్జిబిషన్
- రెండో రోజు - భూవిజ్ఞాన శాస్త్రంపై సమావేశం
- మూడో రోజు - సంస్థకు సంబంధించిన అధికారుల సమావేశం
- నాలుగో రోజు - జియో మెట్రి వర్క్ షాప్
- ఐదో రోజు - విద్యార్థులు, సామాన్య ప్రజలకు సందర్శన
- ఆరో రోజు - కార్యక్రమంపై చర్చ
NGRI Director Dr. Prakash Kumar : మొదటి రోజైన నేడు ప్రారంభోత్సవ వేడుక మొదలైంది. అలాగే ఆర్ అండ్ డీ ప్రదర్శన కూడా ప్రారంభమైంది. భారతదేశంలోని ప్రముఖ భూ విజ్ఞానశాస్త్ర పరిశోధనా సంస్థ అయిన సీఎస్ఐఆర్- జాతీయ భూ భౌతిక పరిశోధనా సంస్థ (NGRI)కు తాను ప్రజలను ఆహ్వానిస్తున్నట్లు ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ ప్రకాశ్ కుమార్ తెలిపారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ అంతర్జాతీయ విజ్ఞానశాస్త్ర వేదికల్లో తన గుర్తింపు కలిగి ఉందని చెప్పారు. 1961లో సీఎస్ఐఆర్-ఎన్జీఆర్ఐను స్థాపించారని ఈ సందర్భంగా ప్రకాశ్ కుమార్ గుర్తు చేశారు.
NGRI Hyderabad Latest News : అంకితభావం కలిగిన శాస్త్రవేత్తలు, సహాయక సాంకేతిక సిబ్బంది, పరిశోధన, ఆవిష్కరణల ద్వారా భారతదేశంలోని భూవిజ్ఞానశాస్త్ర రంగంలో ఎన్‌జీఆర్‌ఐ చెరగని ముద్ర వేస్తోందని డా. ప్రకాశ్ కుమార్ తెలిపారు. ఇన్ని సంవత్సరాలుగా, ఈ సంస్థ ఆధునిక గణన, విశ్లేషణాత్మక సౌకర్యాలను, అత్యాధునిక క్షేత్ర భౌభౌతిక పరికరాలను సంపాదించుకుందని వెల్లడించారు. భూమి అంతర్భాగాన్ని, ముఖ్యంగా భారత ఉపఖండాన్ని, అన్వేషించడానికి శాస్త్రవేత్తలు ప్రయోగాలను రూపకల్పన చేయడానికి, పరికల్పనలను పరీక్షించడానికి, వాటిని ధ్రువీకరించడానికి ఈ సంస్థ అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు. భూవిజ్ఞానశాస్త్ర పరిశోధనలు, మానవ అన్వేషణలో ముందు వరుసలో నిలబెడతాయని ఆశా భావం వ్యక్తం చేశారు. ప్రపంచ భూవిజ్ఞానశాస్త్ర సమస్యలను పరిష్కరించటంలో సీఎస్ఐఆర్ అంచనాలు అందుకుంటారని అన్నారు.
హైదరాబాద్‌లో అధిక వర్షపాతంతోనే.. స్వల్ప భూకంపాలు...
డ్రోన్లతో నీటి జాడల గుర్తింపు.. అభివృద్ధి చేసిన ఎన్‌జీఆర్‌ఐ
Chandrayaan 3 Importance : చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే ఇస్రో గురి ఎందుకు?.. నివాసాలు ఏర్పాటుకోసమేనా!