మార్చి 23, 2020న ప్రధాని మోదీ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఒక్కసారి ఏదో తెలీని మార్పు ఏర్పడింది. వ్యాపారాలు, రవాణా... ఆఖరికి ప్రజల జీవనశైలి కూడా లాక్డౌన్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. ఈ దెబ్బతో అన్ని రంగాలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ముఖ్యంగా ఈవెంట్ మేనేజ్మెంట్ పరిశ్రమలపై భారీగా పడిందని ఓ నివేదిక తెలిపింది.
ఆ నివేదికల ప్రకారం ఈవెంట్ మేనేజర్లకు ఏప్రిల్ నుంచి జులై వరకు మాత్రమే 93 శాతం ఆదాయం వస్తుందని... లాక్డౌన్ వల్ల అవి కూడా రద్దు అయ్యాయని ఆ రంగ నిర్వాహకులు వాపోతున్నారు. ఈ పరిశ్రమలో ఎక్కువ శాతం ప్రొడక్టివిటీతోనే పనిచేస్తారు. లాక్డౌన్లో ఆ పనులేం లేక.. ఉపాధి కోల్పోయారు.
ఇలాంటి సమయంలో వారంతా చేతులు కలిపి.. ఈ విపత్కర పరిస్థితి నుంచి కొత్త మార్గాలను స్వీకరించేందుకు అవకాశంగా మార్చుకుని నిజమైన వ్యాపార స్ఫూర్తిని చూపించేందుకు నిర్ణయించారు. ప్రపంచ ఈవెంట్ మేనేజర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఈపీఏ ఆధ్వర్యంలో ఆన్లైన్లో 50 మంది కళాకారులు కలిసి మే 31న వన్ ఇండియా కాన్సర్ట్‌ను నిర్వహించనున్నారు. కార్యక్రమంలో మహారాష్ట్ర, అసోం, బిహార్, కర్ణాటక, పంజాబ్.. తదితర ప్రాంతాలకు సంబంధించిన కళాకారులు పాల్గొననున్నారు.
ఇది కేవలం ప్రజలకు ఉల్లాస పరచడానికి అనుకుంటే పొరబడినట్లే. ఈ షో ద్వారా వచ్చే ఆదాయాన్ని కొవిడ్ కాలంలో ఉపాధులు కోల్పోయి ఇబ్బంది పడుతున్నవారికి అందజేయనున్నట్లు ఇండియన్ ఈవెంట్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఈపీఏ)లో ప్రముఖ సభ్యులు సంజీవ్ దే తెలిపారు. మూడు వందల మంది కృషితో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: 'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'