ETV Bharat / state

One Crore Plants Planted in Telangana State Wide : రాష్ట్రవ్యాప్తంగా కోటి వృక్షార్చన.. పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు

One Crore Plants Planted in Telangana State Wide : స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను పురస్కరించుకొని కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు కోటి మొక్కలు నాటే ఈ కార్యక్రమాన్ని.. రంగారెడ్డి జిల్లా చిల్కూరు ఫారెస్ట్ బ్లాక్ వేదికగా.. ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వేడుకల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సహా పలువురు పాల్గొన్నారు.

Ministers and MLAs Participated Haritha Haram
One Crore Plants Planted in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2023, 9:51 PM IST

Haritha Haram రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటిన ప్రభుత్వం

One Crore Plants Planted in Telangana State Wide : స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా ప్రభుత్వం కోటి వృక్షార్చన కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పల్లెలు, పట్టణాల్లో కోటి మొక్కలు నాటేందుకు నడుంబిగించారు. రంగారెడ్డి జిల్లా చిల్కూరు ఫారెస్ట్ బ్లాక్​లో కార్యక్రమాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. ఈ పరిధిలోని.. మంచిరేవుల వద్ద అటవీ అభివృద్ధి సంస్థ 360 ఎకరాల విస్తీర్ణంలో తీర్చిదిద్దిన ఫారెస్ట్ ట్రెక్ పార్క్​ను మంత్రులు ప్రారంభించారు. అనంతరం.. ఈ ట్రెక్ పార్కులో మొక్కలు నాటారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, సీఎస్​ శాంతికుమారి మొక్కలు నాటారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్నివర్గాల ప్రజలు.. కోటి వృక్షార్చలో పాల్గొని మొక్కలు నాటాలని వారు కోరారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగర ఆకాశ హర్మ్యాలను వీక్షించేలా ఏర్పాటు చేసిన వాచ్ టవర్ అదనపు ఆకర్షణగా నిలువనుంది. పార్క్‌లో వాకింగ్ ట్రాక్, ట్రెక్కింగ్, రాక్ పెయింటింగ్, తదితర సదుపాయాలు కల్పించారు. ఫారెస్ట్ ట్రెక్ పార్కునంతా మంత్రులు ప్రత్యేక వాహనంలో కలియదిరిగారు.

Ministers One Crore Plants Planted In Haritha Haram : కోటి మొక్కలు నాటే హరితహారం కార్యక్రమం ప్రారంభించిన మంత్రులు

Ministers and MLAs Participated Haritha Haram Programme in Telangana : ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో.. ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్‌పల్లి పురపాలక పరిధిలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, కలెక్టర్‌ యాస్మిన్‌ భాషా మెుక్కలు నాటారు. ఊరు చివర్లో పండ్ల మొక్కలు సైతం ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కోటి వృక్షార్చనలో భాగంగా భూపాలపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, హనుమకొండ జిల్లా శాయంపేట, పెద్దకోడపాక గ్రామాల్లో.. జెడ్పీ ఛైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి మొక్కలు నాటారు. జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో జరిగిన హరితహారం కార్యక్రమంలో.. విద్యార్థులతో కలిసి డీఆర్​డీఓ పీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు.

"ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో కోటి వృక్షార్చన కార్యక్రమం చేపట్టాం. దీని వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం, వాకర్స్​కి వాకింగ్​ ట్రాక్​ సదుపాయం కలదు. రోజుకు సుమారుగా ఉదయం, సాయంత్రం కలిపి 3,000 వేల మంది వాకింగ్​ చేస్తున్నారు. ఇలానే 109 పార్క్​లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. హారితహారంలో భాగంగా ఒక రోజులో కోటి మొక్కలు నాటాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈరోజు కలెక్టర్​ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు అందరూ మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా జరిగింది."- ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి

Telangana Harithosthavam 2023 : 'ధ్వంసమైన పర్యావరణానికి వరం.. మహోద్యమంలో సాగుతున్న తెలంగాణ హరితహారం'

Indian Forest Survey Report 2023 : హరితహారం ద్వారా తొమ్మిదేళ్లలో 273 కోట్ల మొక్కల పెంపకం

KTR Tweet On Haritha Haram : 'హరితహారం.. పుడమితల్లికి వెలకట్టలేని ఆభరణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.