Telangana omicron cases:తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా మరో 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 84కి చేరింది. చికిత్స అనంతరం ఒమిక్రాన్ బాధితుల్లో 32 మంది కోలుకున్నారు.
274 కరోనా కేసులు..
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 21,679 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 274 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,82,489కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,030కు చేరింది. కరోనా బారి నుంచి నిన్న 227 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,779 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదీ చదవండి: