హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ 2019 ముగిసింది. 79వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ముగింపు వేడుకలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దేశంలోని ఇతర సంస్థలకు ఆదర్శం..
నుమాయిష్‌తో తనకున్న అనుబంధాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీకి వచ్చే ఆదాయం ద్వారా 18 విద్యా సంస్థలను నడపటం అభినందనీయమని కొనియాడారు.

ఎగ్జిబిషన్ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించిన పోలీస్, ట్రాఫిక్, మెట్రో, విద్యుత్, అగ్నిమాపక శాఖల అధికారులకు స్పీకర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ ప్రదర్శనలో ఉత్తమ స్టాల్ నిర్వాహకులకు బహుమతులు ప్రదానం చేశారు.