ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమంలో అరెస్టైన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు... బెయిల్పై విడుదలయ్యారు. కరోనా నేపథ్యంలో అన్ని రకాల పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ.. ప్రగతిభవన్ ముట్టడికి ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు ప్రయత్నించారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు మరో 30 కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు.
బెయిల్పై విడుదలైన నాయకులకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వీహెచ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్, తదితరులు పెద్ద ఎత్తున జైలు వద్దకు తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.