ETV Bharat / state

ఊపందుకున్న యాసంగి సాగు- తెలంగాణకు వరుసకట్టిన వలస కూలీలు - వరినాట్లు వేయడానికి కూలీల ఖర్చు ఎంత

North States Farming Workers comes to Telangana : రాష్ట్రంలో యాసంగి సాగు ఊపందుకుంది. మొక్కొజొన్న సహా వేరుశనగ వంటి నూనెగింజలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాల సాగు వేగవంతమైంది. పలుచోట్ల ఇతర రాష్ట్రాల కూలీలువచ్చి నాట్లపనుల్లో నిమగ్నమయ్యారు. స్థానికంగా కూలీల కొరత, రేట్లు అధికంగా ఉండటంతో పనులు వాయిదా పడకుండా ఉండేందుకు రైతులు అనివార్యంగా బిహార్‌, పశ్చిమబంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలను ఉపయోగించుకుంటున్నారు.

North Workers for Paddy Plantation in Telangana
North States Farming Workers come to Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 24, 2023, 5:54 AM IST

Updated : Dec 24, 2023, 6:36 AM IST

ఊపందుకున్న యాసంగి సాగు- వలసబాట పట్టిన తెలంగాణకు నేడు వలస కూలీలు

North States Farming Workers comes to Telangana : రాష్ట్రంలో యాసంగి పనులు చురుగ్గా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కోలాహలం ముగియడం, కొత్త ప్రభుత్వం(Congress) కొలువుతీరడంతో పల్లెల్లో రైతులు వ్యవసాయపనుల్లో నిమగ్నమయ్యారు. ఈ యాసంగిలో సాధారణ సాగు విస్తీర్ణం 54.93 లక్షల ఎకరాలు సర్కారు నిర్థేశించగా ఇప్పటివరకు 9.44 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. వివిధ జిల్లాల్లో వరినాట్లు జోరుగా సాగుతున్నాయి.

యాసంగి పంటకు నీటి విడుదల, మేడిగడ్డ అంశాలపై పూర్తి వివరాలు ఇవ్వండి : సీఎం రేవంత్​ రెడ్డి

North Workers for Paddy Plantation in Telangana : స్థానికంగా కూలీలు పరిమితం కావడం ఒకేసారి పనులు రావడంతో రైతులు అనివార్యంగా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను పిలిపిస్తున్నారు. బిహార్, పశ్చిమబంగాల్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ నుంచి కూలీలు రాష్ట్రంలోని పల్లెలకు వచ్చి వరినాట్లు వేస్తూ ఉపాధి పొందుతున్నారు. కాళేశ్వరం(Kaleswaram), మూసీ పరివాహకప్రాంతం, మిడ్‌మానేరు, అన్నపూర్ణ ప్రాజెక్ట్‌ సహా ఇతర నీటి వనరుల కింద వరిసాగుకి నార్లుపోయగా మరికొందరు నాట్లువేస్తున్నారు.

నాగార్జునసాగర్‌(Nagarjuna sagar) జలాశయంలో నీటి మట్టం ఆశాజనంగా లేకపోవడంతో ఎడమ కాలువ కింద ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో ఆయకట్టు రైతులు సాగునీటి కోసం నిరీక్షిస్తున్నారు. స్థానికంగా కూలీలకు డిమాండ్‌ పెరగడంతో ఇతర రాష్ట్రాల నుంచి రప్పిస్తున్నట్లు తెలిపిన రైతులు ఇక్కడి వారికంటే బయట నుంచి వారు ఎక్కవ సమయం పని చేస్తారని చెబుతున్నారు.

సాగర్ ఆయకట్టులో యాసంగి ఆశలు ఆవిరి - ఖమ్మం జిల్లాలో అగమ్యగోచరంగా సాగు పరిస్థితి

Yasangi Season in Telangana : 2014లో స్వరాష్ట్రం ఆవిర్భావం అనంతరం సర్కారు తీసుకున్న చొరవల వల్ల సాగు విస్తీర్ణం పెరిగింది. వ్యవసాయం, సాగు నీటి రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించడంతో పెద్ద ఎత్తున భూమి సాగు యోగ్యంగా మారింది. స్థానికంగా మధ్యవర్తులు బీహార్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చారు. ఇతర రాష్ట్రాల కూలీలకు ఎకరానికి 4500 నుంచి 6500 వరకు చెల్లిస్తున్నారు. స్థానికంగా ఉండే కూలీలకు కూడా డిమాండ్‌ ఏర్పడింది.

గతంలో 300 నుంచి 400 వరకు ఉండే దినసరి కూలి ప్రస్తుతం 500 నుంచి 600 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. మగ కూలీలకు 700 నుంచి 800, కష్టతరమైన పనుల కోసం 1000 రూపాయలు ఇస్తున్నారు. యాదాద్రి భువనగిరి, సిరిసిల్ల, సిద్ధిపేట, కరీంనగర్‌, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల నుంచి పొరుగు గ్రామాలకు వరి నాట్లకు వచ్చే కూలీలకు రవాణా చార్జీ అదనం. ఇతర రాష్ట్రాల కూలీలతో నాట్లలో వేగం పెరిగింది.

ఒకప్పుడు వలసబాట పట్టిన తెలంగాణకు నేడు వలస కూలీలు వరుసపెట్టి వస్తున్నారు. ఒక్క పని అని కాదు ఏ రంగం పనిలో వెతికినా ఇతర రాష్ట్రాల కూలీలే కనిపిస్తున్నారు. స్వరాష్ట్రం సిద్ధించాక రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం, రియల్‌ ఎస్టేట్‌ రంగాలు విపరీతంగా విస్తరించడం కూలీల అవసరం పెరిగి మంచి ఉపాధి కేంద్రం కావడం విశేషం. సంస్థాగ రుణాలు అందకపోవడం, ప్రైవేటు వడ్డీల బారినపడి గిట్టుబాటు కాకపోయినా నెట్టుకొస్తున్న సేద్యంలో పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో తమకు కూడా రైతు భరోసా పథకం, పంటబీమా పథకం వర్తింపజేయాలని కౌలు రైతులు సర్కారుకు విజ్ఞప్తి చేశారు. ​

ఆశించినంత నీరు లేక ప్రాజెక్టులు వెలవెల - యాసంగి సాగుకు తిప్పలు తప్పేట్టులేవుగా

Last Updated : Dec 24, 2023, 6:36 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.