ETV Bharat / state

నేటినుంచి గుంటూరులో మిర్చి క్రయ విక్రయాలు బంద్​ - no mirchi marketing in guntur

నేటి నుంచి ఏపీ గుంటూరులో మిర్చి క్రయ విక్రయాల బంద్‌ కానున్నాయి. జిల్లాలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.

no-mirchi-marketing-in-guntur-due-to-corona
నేటి నుంచి గుంటూరులో మిర్చి క్రయ విక్రయాల బంద్​
author img

By

Published : Apr 28, 2020, 12:23 PM IST

కరోనా మహమ్మారి రోజురోజుకీ విస్తరిస్తున్న తరుణంలో ఈ రోజు నుంచి మే 3వ తేదీ వరకు ఏపీ గుంటూరులో మిర్చి క్రయవిక్రయాలు జరపరాదని ఎగుమతి వ్యాపారుల సంఘం నిర్ణయించింది. గుంటూరు మిర్చియార్డు సమీపంలోని ఓ బిర్యానీ హోటల్‌ యజమాని కరోనా అనుమానిత లక్షణాలతో మృతి చెందటం వల్ల పరిసర ప్రాంతాల్లో అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి శీతలగిడ్డంగులు, గోదాముల్లో ఎగుమతి వ్యాపారులు మిర్చి క్రయవిక్రయాలు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో మిర్చి విక్రయాలు కొనసాగిస్తే కరోనా కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉంటుందని గుర్తించిన జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు మే 3వ తేదీ వరకు ఎటువంటి విక్రయాలు జరపవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని శీతలగిడ్డంగులు, గోదాముల్లో మిర్చి క్రయవిక్రయాలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు సంఘ అధ్యక్షుడు జుగిరాజ్‌ బండారి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.