కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన జాతీయ వైద్య మండలి బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు నాంపల్లిలోని నిలోఫర్ ఆసుపత్రి ఎదుట వైద్యులు విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు రాజకీయ నాయకుల,వ్యాపారస్థుల లబ్ధి చేకూర్చే విధంగా ఉందని డాక్టర్లు మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని డాక్టర్లు హెచ్చరించారు.
'వైద్యమండలి బిల్లుపై నీలోఫర్లో నిరసనలు' - వైద్య మండలి బిల్లు
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన వైద్య మండలి బిల్లుకు వ్యతిరేకంగా నీలోఫర్ ఆసుపత్రిలో డాక్టర్లు విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. తక్షణమే బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.