కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 60ని రద్దు చేయాలని... మెడికల్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ హైదరాబాద్లో ఆందోళనకు దిగింది. 15ఏళ్ల నుంచి పని చేస్తున్నా తమను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ క్రమబద్ధీకరించలేదని నిలోఫర్ ఆస్పత్రిలో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నంబర్ 60 ద్వారా సర్కారు మరోసారి తమను మోసం చేసిందని వాపోయారు.
కరోనా సమయంలో ప్రాణాలకు ఎదురొడ్డి పని చేస్తున్నా... పట్టించుకోకుండా తమకు అన్యాయం చేయడంపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదు రోజులుగా ధర్నా చేస్తున్నా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సమాన పనికి సమాన వేతనం అన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని... జీవో నంబర్ 60ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విధులు బహిష్కరించి నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: నవ్వులు పూయిస్తున్న ఏటీఎం దొంగల తతంగం.. ఏం చేశారంటే..!